కక్కుర్తి పడను అంటుంది

ఛలో, గీత గోవిందం సినిమాల్లో హీరోయిన్ గా హీరో పాత్రకు సమానమైన కేరెక్టర్స్ చేసి ఆకట్టుకున్న రష్మిక మందన్న.. తాజాగా విడుదలైన డియర్ కామ్రేడ్ లోను ఫుల్ [more]

Update: 2019-08-01 05:47 GMT

ఛలో, గీత గోవిందం సినిమాల్లో హీరోయిన్ గా హీరో పాత్రకు సమానమైన కేరెక్టర్స్ చేసి ఆకట్టుకున్న రష్మిక మందన్న.. తాజాగా విడుదలైన డియర్ కామ్రేడ్ లోను ఫుల్ లెన్త్ రోల్ దక్కించుకుంది. దేవదాస్ సినిమాలో కాస్త సాదా సీదా పాత్రకు తలొగ్గన రష్మిక మిగతా మూడు సినిమాల్లోనూ మంచి కేరెక్టర్స్ నే ఎంచుకుంది. కానీ ఈకాలంలొ వచ్చే సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా కథలు రాసుకుని.. హీరోయిన్స్ ని కేవలం నాలుగు పాటలకు, అందాలు ఆరబొయ్యడానికి తప్ప మంచి కేరెక్టర్స్ ని వారికీ ఇవ్వలేకపోవుతున్నారు. కానీ రష్మిక మాత్రం మంచి పాత్రలను ఎంచుకుంటుంది. డియర్ కామ్రేడ్ సినిమా మొత్తం రష్మిక లిల్లి పాత్ర చుట్టూతా తిరిగే కథే.

ఇక డియర్ కామ్రేడ్ సో సో గా ఆడుతున్నప్పటికీ.. రష్మిక చేతిలో నితిన్ భీష్మ తో పాటుగా స్టార్ హీరో మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలు ఉన్నాయి. ఇంకా అల్లు అర్జున్ సినిమా కూడా రష్మిక కు దక్కే అవకాశం ఉంది. ఇక డియర్ కామ్రేడ్ విడుదల తర్వాత రష్మిక మాట్లాడుతూ.. తనకి బోలెడన్ని అవకాశాలొస్తున్నాయని.. కాకపోతే వాటిలో హీరో పక్కన డాన్సులకే పరిమితమయ్యే పాత్రలు, అందాలు ఆరబోసే మసాలా పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయని అందుకే చాలా సినిమాలు ఒప్పుకోవడం లేదని చెప్పిన రష్మిక… నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తానని చెబుతుంది. ఇక కథ డిమాండ్ ని బట్టి రొమాంటిక్ గా లిప్ లాక్స్ కి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని చెబుతుంది ఈ చిన్నది.

Tags:    

Similar News