తమిళ హీరోలకు గాలం వేస్తున్న హీరోయిన్?

ప్రస్తుతం తెలుగులో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చాలా తక్కువ సమయంలో చేరుకున్న పొట్టిపిల్ల రష్మిక మందన్న.. ఊపు మాములుగా లేదు. మహేష్ తో చేసిన [more]

Update: 2020-02-17 10:11 GMT

ప్రస్తుతం తెలుగులో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చాలా తక్కువ సమయంలో చేరుకున్న పొట్టిపిల్ల రష్మిక మందన్న.. ఊపు మాములుగా లేదు. మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ముచ్చట్లు ముగియకముందే.. యంగ్ హీరో నితిన్ జంటగా నటించిన భీష్మ వచ్చేస్తుంది. ఈ సినిమాలో రష్మిక అందాల విందు స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుంది. ఇక అల్లు అర్జున్ తో చిందులు వెయ్యడానికి రెడీ కాబోతున్న రష్మిక మందన్న ఇప్పుడు తమిళ హీరోలకు గాలం వేస్తుంది. ఇంతకుముందే తమిళ సూపర్ స్టార్ విజయ్ తో సినిమా చెయ్యాల్సిన రష్మిక కి అది తృటిలో తప్పిపోయింది.

అయితే తాజాగా భీష్మ ప్రమోషన్స్ లో మీకు ఏ హీరోపైన క్రష్ ఉందని, అలాగే ఫ్యూచర్ లో ఏ హీరోతో కలిసి నటించాలని ఉంది అని అడగగానే… రష్మిక తడుముకోకుండా కోలీవుడ్ టాప్ హీరో విజయ్ పేరు చెప్పింది. తనకి చిన్నప్పటినుండి.. తమిళ హీరో విజయ్ అంటే క్రష్ ఉండేదని.. అలాగే అవకాశమొస్తే.. ఫ్యూచర్ లో విజయ్ సరసన నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. మరి విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినందుకు బాగా ఫీలవుతున్నట్లుగా కనబడుతుంది రష్మిక వ్యవహారం. మరి తెలుగు హీరోలను ఎడాపెడా చుట్టేస్తున్న రష్మిక తమిళ హీరోలకు గాలం వేసి. అక్కడ కూడా చక్రం తిప్పాలని గట్టిగానే డిసైడ్ అయినట్లుగా అనిపిస్తుంది

Tags:    

Similar News