రష్మిక కు ఇంత తక్కువ రెమ్యూనరేషనా..?

Update: 2018-10-05 07:00 GMT

నాగ శౌర్య 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ మనసుల్ని గెలుచుకున్న ఈ అమ్మడు రెండో చిత్రం 'గీత గోవిందం'తో బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇక ఆమె మూడో చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయిన 'దేవదాస్' ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇలా చేసిన మూడు సినిమాల్లో ఈమెకు మంచి పేరు రావడంతో వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగులో కొన్ని పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫేమ్ కి తగట్టు పారితోషికాన్ని మాత్రం పెంచట్లేదట.

ఓపెనింగ్ లకు కూడా అంతే...

చాలా కూల్ గా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుని తర్వాత మెల్లిగా పారితోషికాన్ని పెంచాలని ఆలోచిస్తుందంట రష్మిక. అలానే షోరూమ్ ఓపెనింగ్స్ కు గానూ రష్మిక కేవలం 5 లక్షల పారితోషికాన్ని మాత్రమే తీసుకుంటుందట. సాధారణంగా అయితే ఏ హీరోయిన్ అయినా షో రూమ్ ఓపెన్ చేయాలంటే 10 లక్షలకి తక్కువ తీసుకోరు. కానీ రష్మిక రెమ్యూనరేషన్ ను తగ్గించి ఆఫర్లను చేజిక్కించుకోవాలనుకుంటుందట. తక్కువ తీసుకుంటే ఎక్కువ ఆఫర్స్ వస్తాయని భావిస్తుందో ఏంటో మరి.

Similar News