రష్మిక పెద్ద ప్లానే వేసిందే..!

గీత గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై అందరి మనసులు దోచుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా ఎదిగే దిశలో వెళుతోంది. రీసెంట్ గా అల్లు అర్జున్, [more]

Update: 2019-05-12 07:41 GMT

గీత గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై అందరి మనసులు దోచుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా ఎదిగే దిశలో వెళుతోంది. రీసెంట్ గా అల్లు అర్జున్, మహేష్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన రష్మికకు ఇంకా స్టార్ స్టేటస్ రాలేదు కనుక ఈలోపల ఆమెతో సినిమాలు చేద్దామని యంగ్ హీరోస్, డైరెక్టర్స్ ఆమెను సంప్రదిస్తున్నారు. రష్మికకు భారీ మొత్తం ఎర వేస్తున్నా మీడియం సినిమాలు ఒప్పుకోవడం లేదు.

పెద్ద సినిమాలు చాలు

కేవలం పెద్ద సినిమాలకు సంతకం చేసి ఆ చిత్రాలకి ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చే విధంగా ఉండాలని భావిస్తుందని టాక్ నడుస్తుంది. అందుకే మీడియం, చిన్న సినిమాలు ఒప్పుకోవడం లేదు అని టాక్. చిన్న సినిమాలు చేసి త్వరగా కనుమరుగు అయిపోవడం కన్నా పెద్ద సినిమాలు చేసి ఒక అయిదారేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాలి అని రష్మిక భావిస్తుందంట.

Tags:    

Similar News