హరితేజ గట్టిగా కొట్టేట్లుంది

తెలుగులో బిగ్ బాస్ వన్ లో ఎవరూ పెద్దగా హైలెట్ అవ్వకపోయినా… బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ హరితేజ మాత్రం ఫుల్ ఫామ్ లోకొచ్చేసింది. అ…ఆ [more]

Update: 2019-12-17 06:21 GMT

తెలుగులో బిగ్ బాస్ వన్ లో ఎవరూ పెద్దగా హైలెట్ అవ్వకపోయినా… బిగ్ బాస్ టాప్ 3 కంటెస్టెంట్ హరితేజ మాత్రం ఫుల్ ఫామ్ లోకొచ్చేసింది. అ…ఆ సినిమాలో అదిరిపోయే రోల్ ప్లే చేసిన హరితేజ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక కెరీర్ లో దూసుకుపోతుంది. ఆ తర్వత సినిమాలే కాదు యాంకరింగ్ లోను హరితేజ కొత్తగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక సినిమాల్తో, బుల్లితెర షోస్ తో ఇరగదీస్తున్న హరితేజ ఇప్పుడు రెండు బడా సినిమాల్లో మంచి రోల్స్ పోషించింది.

రేపు శుక్రవారం విడుదలకబోతున్న ప్రతిరోజు పండగే సినిమా లో హరితేజ ఓ మంచి రోల్ పోషించడం… ఆ సినిమా ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంటుంది. తాజాగా ప్రతిరోజూ పండగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరితేజ మెరుపులు మాములుగా లేవు. ఇక రెండో బడా స్టార్ మూవీ సరిలేరు నీకెవ్వరూ లో అయితే రష్మిక తో కలిసి ఓ పాటేసుకుంది, మహేష్ ని రష్మిక టీజ్ చేసే హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లో రష్మిక తో కలిసి డాన్స్ స్టెప్స్ కూడా వేసింది హరితేజ. దీనిబట్టి సరిలేరు నీకెవ్వరులో హరితేజ రష్మిక పక్కన ఉండబోయే ఫ్రెండ్ లేదా రిలేటివ్ పాత్రో చేసుంటుంది అంటే సినిమాలో హరితేజ చాలావరకు కనిపిస్తూ సందడి చేస్తుందన్నమాట. సో బిగ్ బాస్ వలనో.. ఏమో హరితేజ మాత్రం కెరీర్ లో బాగా బిజీగా మారింది.

Tags:    

Similar News