జాను పోవడంతో హ్యాపీ గా ఉన్న హీరోయిన్?

సమంత – శర్వానంద్ జంటగా తెరకెక్కిన 96 రీమేక్ జాను సినిమా గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో.. డల్ కలెక్షన్స్ తో ట్రేడ్ [more]

Update: 2020-02-17 10:00 GMT

సమంత – శర్వానంద్ జంటగా తెరకెక్కిన 96 రీమేక్ జాను సినిమా గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో.. డల్ కలెక్షన్స్ తో ట్రేడ్ కి షాకిచ్చింది. జాను సినిమా ప్లాప్ లిస్ట్ లోకెల్లడానికి రెడీ గా ఉండడం చూసి ఇప్పుడు ఓ హీరోయిన్ హ్యాపీ గా ఉందని అంటున్నారు. జాను సినిమా రైట్స్ కొన్నప్పుడు దిల్ రాజు ముందుగా సమంత నే హీరోయిన్ గా అనుకోవడమే తడువు.. సమంత కి 96 సినిమా చూపించగా.. ఆమె త్రిష కేరెక్టర్ చెయ్యడానికి సంకోచించి.. ఓకె చెప్పకుండా తప్పించుకోవడంతో. దిల్ రాజు సెకండ్ ఆప్షన్ గా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ లెవల్లో ఉన్న రష్మిక ని జాను సినిమా హీరోయిన్ గా చెయ్యమని సంప్రదించాడట.

అయితే రష్మిక దిల్ రాజు ఆఫర్ కి నో చెప్పడంతో.. తిరిగి సమంత నే బ్రతిమిలాడి దిల్ రాజు ఫైనల్ చేసుకున్నాడు. సో అలా రష్మిక నుండి జాను ప్లాప్ చేజారడంతో.. రష్మిక ఇప్పుడు హ్యాపీ గా ఉందట. ఇక భీష్మ ప్రమోషన్స్ లో రష్మిక ను జాను వదులుకోవడం గురించి అడగగా.. అది అయిపోయిన విష‌యం క‌దా.. నేను చెప్ప‌కూడ‌దు. ష్‌ అంటూ నవ్వుతూ ఆ మేటర్ ని కవర్ చెయ్యడం చూస్తుంటే… రష్మిక మామూలుది కాదు… జాను ప్లాప్ నుండి భలేగా తప్పించుకుంది అని అనుకొకమానరు.

Tags:    

Similar News