రష్మిక ఫస్ట్.. అదితి సెకండ్

మహర్షి సినిమా షూటింగ్ చివరి దశలోకి వచ్చేసింది. ఇక మహేష్ బాబు మహర్షి సినిమా తర్వాత ఫ్రీ అవుతాడు. మహర్షి సినిమా మే 9 న విడుదల [more]

Update: 2019-03-20 04:33 GMT

మహర్షి సినిమా షూటింగ్ చివరి దశలోకి వచ్చేసింది. ఇక మహేష్ బాబు మహర్షి సినిమా తర్వాత ఫ్రీ అవుతాడు. మహర్షి సినిమా మే 9 న విడుదల కాబోతుంది. మహర్షి సినిమా షూటింగ్ పూర్తయినా మహేష్ బాబు మాత్రం తన తదుపరి సినిమాని జూన్ లో కానీ మొదలుపెట్టడు. మహర్షి సినిమా షూటింగ్ తోనూ, యాడ్ షూట్స్ తో ని బాగా బిజీ అయిన సూపర్ స్టార్.. కాస్త విరామం తీసుకుని తన తదుపరి చిత్రన్ని ప్రారంభిస్తాడు. అయితే మహర్షి మహేష్ కి ల్యాండ్ మార్క్ మూవీ అయితే… తన 26 వ చిత్రాన్నిఎవరితో చేస్తాడో క్లారిటీ లేదు. ఇక సుకుమార్ తో తన 26 వ చిత్రం అనౌన్సమెంట్ అయ్యాక కూడా… ఆ చిత్రాన్ని మహేష్ ఆపేసాడు. ఇక తాజాగా ఎఫ్ 2 డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేష్ 26 వ చిత్రమంటున్నారు కానీ.. మహేష్ మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. మహేష్ – అనిల్ సినిమాపై అధికారిక ప్రకటన లేదు.

అయితే అనిల్ రావిపూడి మాత్రం తన నెంబ‌ర్ 5.. లోడింగ్‌.. అంటూ ట్వీట్ చేసాడు. ఇప్పటివరకు పటాస్, సుప్రీం, రాజా ధి గ్రేట్, ఎఫ్ 2 చిత్రలు చేసిన అనిల్ తన 5 వ చిత్రాన్ని త్వరలోనే మొదలెడుతున్నానంటూ చిన్న క్లూ ఇచ్చాడు. ఇక మీడియాలో అనిల్ మహేష్ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ లో బిజీ అయ్యాడని.. మహేష్ సరసన హీరోయిన్స్ తో పాటుగా సినిమాలోని కీలక నటుల ఎంపిక మొదలు పెట్టాడనే టాక్ వినబడుతుంది. ఇప్పటికే మహేష్ కోసం.. రష్మికాని అనిల్ సంప్రదించాడని.. ఇక రెండో హీరోయిన్ కోసం కూడా అనిల్ సెర్చింగ్ అంటూ వార్తలొస్తున్నాయి.

అయితే రష్మిక క్రేజ్ ని బట్టి మహేష్ సినిమాలో రష్మిక ఫస్ట్ హీరోయిన్ అని.. ఇక సెకండ్ హీరోయిన్ గా మహెష్ బావ సుధీర్ బాబుతో సమ్మోహనం తెలుగు చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న అదితి రావు చేస్తుందని అంటున్నారు. రష్మిక మెయిన్ కాగా. అదితి సెకండ్ హీరోయిన్ అంటున్నారు. ఇక ఈసినిమాలో సీనియర్ లేడి సూపర్ స్టార్ విజయ శాంతి కూడా ఒక కీ రోల్ చేస్తుందని.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడని అంటున్నారు.–

Tags:    

Similar News