గ్లామర్ ఛాన్సెస్ రావడం లేదా? ఒప్పుకోవడం లేదా?

రష్మిక మందన్న లో హాట్ యాంగిల్ కానీ, గ్లామర్ లుక్స్ కానీ లేవు. ఎప్పుడూ సాదా సీదాగానే కనబడుతుంది. కానీ లక్కు మాత్రం చాతాడంత ఉండడం, నటనలో [more]

Update: 2020-01-07 05:47 GMT

రష్మిక మందన్న లో హాట్ యాంగిల్ కానీ, గ్లామర్ లుక్స్ కానీ లేవు. ఎప్పుడూ సాదా సీదాగానే కనబడుతుంది. కానీ లక్కు మాత్రం చాతాడంత ఉండడం, నటనలో అమ్మడుకి మంచి మార్కులుండడంతో.. స్టార్ హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటుంది. ఆడియో వేడుకలకి, ప్రీ రిలీజ్ వేడుకలకి డిజైన్ వేర్ డ్రెస్సులతో రష్మిక కాస్త హాట్ గా కనబడినా చూసిన వారికీ ఆమె గ్లామర్ షో చేస్తున్న విషయం కూడా అర్ధం కాదు. అలా చిన్న పిల్లలా.. క్యూట్ గా ఉటుంది కానీ.. హాట్ గా మాత్రం కాదు. ఛలో ను ట్రెడిషనల్ రోల్, గీత గోవిందం లోను సాదా సీదా ముక్కోపి అమ్మాయిగాను, దేవదాస్ లోను పోలీస్ డ్రెస్ ఇలా తప్పితే రశ్మిక్ హాట్ యాంగిల్ బయటపడింది లేదు.

హీరోయిన్స్ అంతా హాట్ యాంగిల్ అండ్ గ్లామర్ ఫోజుల్తో అదరగొట్టేస్తుంటే రష్మిక మాత్రం నార్మల్ లుక్స్ తోనే లక్కుని, పెరఫార్మెన్సు ని నమ్ముకుంది. అంటే దర్శకులు ఆమెకి హాట్ గ్లామర్ పాత్రలివ్వడం లేదా? లేదా ఆమె చెయ్యడం లేదా? అనేది డౌట్. కానీ రష్మిక గ్లామర్ షో చేసినా ఆమె లోని సాదాసీదా లుక్ యాంగిల్ ని మాత్రం ఎవరూ మర్చిపోరు. తాజాగా మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలోనూ రష్మిక జస్ట్ క్యూట్ అండ్ నార్మల్ లుక్స్ తోనే కనిపిస్తుంది. గ్లామర్ షో చెయ్యడానికి అంతకన్నా ఆమెకి స్కోప్ కూడా లేదు. మహేష్ పక్కన చాలా చిన్నగా అనేకన్నా పొట్టిగా ఉన్న రష్మిక ఆ హైట్ విషయం ఎలా మ్యానేజ్ చేసిందో కానీ.. మరీ గ్లామర్ లెస్ పాత్రలతో ఆమె ఎంత కాలం నెడుతుందో అనేది తెలియదు. మహేష్ బాబు తో సో క్యూట్, సో స్వీట్ అంటూ జస్ట్ ఓకె ఓకె గా అనిపిస్తున్న రష్మిక అల్లు అర్జున్ సినిమాలో ఏమైనా గ్లామర్ షో చేస్తుందో లేదంటే… మరి ఆ సినిమాలోను రష్మిక డీగ్లామర్ లుక్ అంటూ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ఏమైనా సాంగ్స్ లో అయినా రష్మిక హాట్ యాంగిల్ చూసే అదృష్టం అభిమనాలకొస్తుందో.. లేదో..!

Tags:    

Similar News