మొత్తం రష్మిక నే కనబడింది

సరిలేరు నీకెవ్వరూ నుండి మండే స్పెషల్ దిగిపోయింది. హి ఈజ్ సో క్యూట్ అంటూ రష్మిక మందన్న మహేష్ బాబుని టీజ్ చేసే సాంగ్ ని వీడియో [more]

Update: 2019-12-17 06:11 GMT

సరిలేరు నీకెవ్వరూ నుండి మండే స్పెషల్ దిగిపోయింది. హి ఈజ్ సో క్యూట్ అంటూ రష్మిక మందన్న మహేష్ బాబుని టీజ్ చేసే సాంగ్ ని వీడియో తో పాటుగా వదిలింది టీం. అయితే సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ అంతగా బాగోకపోయినా.. ఆ సాంగ్ లో మహేష్ వెంటపడుతూ రష్మిక మందన్న చేసిన అల్ల్లరి, డాన్స్ మాములుగా లేదు. నిజంగా మహేష్ బాబు క్యూట్ గానే ఉన్నాడు. కానీ రష్మిక మాత్రం మరింత క్యూట్ గా ఈ సాంగ్ కి హాట్ హాట్ స్టెప్స్ తో డాన్స్ ఇరగదీసింది. టీజర్ లో స్పేస్ లేదు, పోస్టర్స్ లో స్పేస్ లేదు అంటూ రష్మిక తోపాటుగా ఆమె అభిమానులు కూడా తెగ ఫీల్ అయ్యారు.

అయితే రష్మిక మీద స్పెషల్ టీజర్ అంటూ కాస్త ప్రచారం జరిగినా అనిల్ రావిపూడి లైట్ తీసుకున్నాడు. కానీ సరిలేరు నీకెవ్వరూ నుండి వదిలిన మూడో సాంగ్ మొత్తం రష్మిక మీదనే షూట్ చేశారు మహేష్ బాబు బ్యాగ్ తో అలా అలా నడుస్తున్నప్పటికీ.. అందరి కళ్ళు రష్మిక డాన్స్ మీదే ఉంది. సంగీత, హరితేజ లతో కలిసి రష్మిక వేసిన డాన్స్ స్టెస్ప్ భీబత్సంగా ఉన్నాయ్. మహేష్ ఎలాంటి స్టెప్స్ వేయకపోయినా.. రష్మిక లుక్స్, ఆమె డ్రెస్, ఒక టైం లో రష్మిక వేసిన పల్లెటూరి గెటప్ ఇలా అన్ని రష్మిక ని హైలెట్ చేసేలా ఉన్నాయి. మరి రెండు రోజులుగా మహెష్ తో రష్మిక క్యూట్ అండ్ రొమాంటిక్ పోస్టర్స్ లాగే ఈ హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లో రష్మిక డాన్స్ అండ్ క్యూట్ ఎక్సప్రెషన్స్ ఉన్నాయి.

Tags:    

Similar News