రష్మిక రెమ్యూనరేషన్ విషయంలో మీడియాకి గట్టిగా సమాధానం చెప్పింది

కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసి సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న కు ఆ తరువాత తెలుగు నుండి ఆఫర్స్ వచ్చాయి. ఛలో సినిమాతో సూపర్ [more]

Update: 2019-07-15 10:56 GMT

కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసి సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న కు ఆ తరువాత తెలుగు నుండి ఆఫర్స్ వచ్చాయి. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఆ తరువాత వెంటనే గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఆమె రేంజ్ మారిపోయింది. దాంతో మన స్టార్ హీరోస్ అంత ఆమెపై కన్నేశారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోస్ తన సినిమాల్లో రష్మిక కు ఛాన్స్ ఇచ్చారు.

తన డిమాండ్ కూడా పెరగడంతో పారితోషకం కూడా పెంచేసింది. కానీ తన మాతృ భాష అయిన కన్నడలో సినిమా అవకాశాలు వస్తున్నా ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ చెప్పడం, డేట్స్ దొరకపోవడం తో కన్నడ దర్శక నిర్మాత లకు దిమ్మదిరుగుతోంది. మన అమ్మాయి అయ్యుండి ఆమె ఇంతలా డిమాండ్ చేయడం ఏంటి? అని వారికి అర్ధం కావడంలేదు. అయితే మీడియా వారు రెమ్యూనరేషన్ హైక్ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె అదిరిపోయే సమాధానం చెప్పింది.

రీసెంట్ గా ‘డియర్ కామ్రేడ్’ను ప్రమోట్ చేయడం కోసం బెంగళూరుకు వెళ్లిన రష్మికను అక్కడ మీడియా వారు రెమ్యూనరేషన్ హైక్ ఎందుకు చేసారు అని అడిగితే..ఆమె మీడియాలో ఉన్న మీరు ఏటా హైక్స్, ప్రమోషన్లు కోరుకోరా? అలాంటపుడు నేను పారితోషకం పెంచడంలో సమస్యేంటి అని తడుముకోకుండా సమాధానం చెప్పింది రష్మిక. రెమ్యూనరేషన్ అయితే హైక్ చేసింది కానీ ఎంత చేసిందో తెలియాల్సిఉంది

Tags:    

Similar News