నెటిజెన్స్ పై రష్మిక ఫైర్?

సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ట్రోలింగ్ ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. సమంత లాంటి హీరోయిన్ తనపై జరిగే ట్రోలింగ్ కి అదిరిపోయే సమాధానాలిచ్చి…. నెటిజెన్స్ నోరు [more]

Update: 2019-11-08 05:57 GMT

సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ట్రోలింగ్ ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. సమంత లాంటి హీరోయిన్ తనపై జరిగే ట్రోలింగ్ కి అదిరిపోయే సమాధానాలిచ్చి…. నెటిజెన్స్ నోరు మూపిస్తుంది. తాజాగా మరో హీరోయిన్ కూడా ఈ ట్రోలింగ్ బారిన పడింది. కన్నడ నుండి టాలీవుడ్ కొచ్చిన రష్మిక మందన్న ఇక్కడ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చాలా త్వరగా చేరుకుంది. విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు చేసిన రష్మిక కి ఆ సినిమాల్తోనే తెగ ఫెమస్ అవడం, స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ రావడం జరిగింది. మహేష్, అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించడం అంటే ఆమెకున్న లక్కు, నటన అన్ని కారణాలే. మరో పక్క నితిన్ సరసన భీష్మ చిత్రంలోనూ నటిస్తుంది. భీష్మ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదలైంది. రష్మిక నటన, ఆమె అందం, నితిన్ సరసన అన్ని హైలెట్ అనేలా ఉండడంతో.. భీష్మ పై అంచనాలు పెరిగాయి.

అయితే రష్మిక మందన్న పై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్ దేనిమీదంటే రష్మిక – విజయ్ దేవరకొండలు కలిసి రెండు సినిమాలో నటించడంతో వారి మధ్యన ఏదో ఉందనే ప్రచారం ఎప్పటినుండో ఉంది. అయితే రష్మిక పర్సనల్ లైఫ్ మీద, విజయ్ తో ఎఫ్ఫైర్ మీద అసభ్యంగా మట్లాడేసరికి.. రష్మిక తన మీద వ్యక్తిగతంగా చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మేము చేసే నటన గురించి మాట్లాడే హక్కు మీకుంది…. వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేసి మా జీవితాల గురించి, కుటుంబాల గురించి మట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి పనికి గౌరవం అవసరం. ముందుగా ఎదుటి గౌరవించటం నేర్చుకోండి అంటూ.. తనని ట్రోల్ చేసే వారి మీద రష్మిక ఫైర్ అయ్యింది.

Tags:    

Similar News