ఆ హీరోయిన్ కి లుక్ షూట్ జరుగుతుందా?

ఛలో తో హిట్ కొట్టి.. గీత గోవిందం తో సూపర్ హిట్ కొట్టిన రష్మిక కి ఏకంగా మహేష్ సరసన నితిన్ సరసన ఛాన్స్ రావడమే కాదు… [more]

Update: 2020-09-27 02:00 GMT

ఛలో తో హిట్ కొట్టి.. గీత గోవిందం తో సూపర్ హిట్ కొట్టిన రష్మిక కి ఏకంగా మహేష్ సరసన నితిన్ సరసన ఛాన్స్ రావడమే కాదు… ఆ సినిమాలు హిట్ కూడా అయ్యాయి. అయితే జస్ట్ సౌత్ సినిమాలు చేసే రశ్మికకి అల్లు అర్జున్ పుష్ప లో పాన్ ఇండియా ఛాన్స్ ఇచ్చాడు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరక్కేయబోయే సినిమాలో రష్మిక హీరోయిన్. అయితే రష్మిక రేంజ్ పాన్ ఇండియా కి సరిపోతుందా అనే వారు లేకపోలేదు. కానీ సుకుమర్ డిజైన్ చేసే పాత్ర అన్ని రకాల ప్రేక్షకులకు ఎక్కడం పక్కా అనేది రంగస్థలం తోనే అర్ధమైంది. అయితే ఈ సినిమాలో రష్మిక డి గ్లామర్ పాత్ర చేయబోతుంది. ఈ పాత్ర కోసం చిత్తూరు యాస  కూడా నేర్చుకుంది. అయితే కరోనా కారణంగా పుష్ప సినిమా నవంబర్ నుండి పట్టాలెక్కబోతుంది.

కానీ హీరోయిన్ రష్మిక చేతిలో మరో సినిమా కూడా లేదు. అయితే రష్మిక అప్పుడే పుష్ప కోసం హైదరాబాద్ వచ్చేసింది. కరోనా కారణంగా ఇంటి దగ్గరే ఉండిపోయిన రష్మిక పుష్ప సినిమా కోసం హైదరాబాద్ కి రావడం ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అమ్మగారి బర్త్ డే కి విజయ్ ఇంటికి కూడా వెళ్లడం జరిగింది. అయితే రష్మిక పుష్ప షూట్ మొదలు కాకుండానే హైదరాబాద్ కి వచ్చింది ఎందుకంటే.. సుకుమార్ రశ్మికపై ఫోటో షూట్ నిర్వహించనున్నాడట. రశ్మిక్ డి గ్లామర్ లుక్ టెస్ట్ పూర్తయ్యాక, ఆమె యాస టెస్ట్ కూడా పూర్తి చేసుకుని అన్ని రెడీ అయ్యాకే కూల్ గా సుక్కు రంగంలోకి దిగుతాడట. అంటే రష్మిక హైదరాబాద్ కి రావడానికి కారణం పుష్ప లుక్ టెస్ట్ కోసం ఫోటో షూట్స్ జరుగుతున్నందున అన్నమాట.

Tags:    

Similar News