పిక్ టాక్: సమంతకి పోటీ వస్తుంది.

హీరోయిన్ సమంత అక్కినేని జిమ్, వర్కౌట్స్, లాన్ లో ఎక్సరసైజెస్ వీడియోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సమంత ఫిట్ నెస్ విషయంలో [more]

Update: 2020-12-11 04:44 GMT

హీరోయిన్ సమంత అక్కినేని జిమ్, వర్కౌట్స్, లాన్ లో ఎక్సరసైజెస్ వీడియోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సమంత ఫిట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గదు. మరి పుల్లల తయారవుతున్న సమంత, గ్లామర్ కోసం వర్కౌట్స్ పిచ్చి పట్టిన సమంత, చేతిలో సినిమాలు లేకపోయినా సమంతకి జిమ్ కష్టాలు ఎందుకు అనే కామెంట్స్ చేసినా సమంత మాత్రం లెక్క చెయ్యడం లేదు. మరి అలాంటి సమంత కే పోటీ వస్తుంది ఓ భామ. ఈమధ్యన టాలీవుడ్ టాప్ లిస్ట్ లో దూసుకుపోతున్న రష్మిక జిమ్ వర్కౌట్స్ సమంతానే ఛాలంజ్ చేస్తున్నాయి. 

పుష్ప పాన్ ఇండియా సినిమాతోనే కాదు, శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు లో నటిస్తున్నా రష్మిక అటు తమిళంలోనూ దూసుకుపోతుంది. మరి ఈ బేబీ జిమ్ కష్టాలు కూడా మాములుగా లేవు. ఆ మధ్యన సముద్రపు ఒడ్డున బీచ్ లో వర్కౌట్స్ తో హైలెట్ అయిన రష్మిక.. ఇప్పుడు ఓ బాల్ మీద వెల్లకిలా పడుకుని కష్టాలు పడుతుంది. నిన్నగాక మొన్న అటూ ఇటూ  కదులుతూ వర్కౌట్స్ తో అదరగొట్టిన రష్మిక నేడు జిమ్ డ్రెస్సులో పొట్టి నిక్కరుతో బాల్ ఎక్సరసైజ్ చేస్తూ కుస్తీలు పడుతుంది. మరి మీరు రష్మిక బాల్ ఎక్సరసైజ్ ని ఓ లుక్కెయ్యండి.   

Similar News