హ్యాట్రిక్ హిట్ కోసం వెయిటింగ్ ఇక్కడ..!

Update: 2018-09-27 06:42 GMT

ఛలో సినిమాలో అమాయకంగా కనబడుతూనే బీర్లు తాగి రచ్చ చేసే స్టూడెంట్ గా టాలీవుడ్ లోకి హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న... విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలో సాఫ్ట్ వెర్ ఉద్యోగిగా... మొహంలో సీరియస్ నెస్ తో హీరో మీద ఈగోకి పోయే కేరెక్టర్ లో అదరగొట్టింది. సినిమా మొత్తం ఒకే ఎక్స్ ప్రెషన్ తో అదరగొట్టిన రష్మిక ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రెండో సినిమాతోనే 100 కోట్ల క్లబ్బులోకి చేరిన సినిమాలో నటించి సెన్సేషన్ సృష్టించిన రష్మిక మూడో సినిమా దేవదాస్ తో కూడా హిట్ కొట్టాలనే కసితో ఉంది. దేవదాస్ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన రష్మిక ఈ సినిమాలో కాస్త గ్లామర్ ఒలకబోసినట్టుగా ట్రైలర్, సాంగ్స్ చూస్తే తెలుస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున - నాని కాంబోలో మల్టీస్టారర్ గా తెరకెక్కిన దేవదాస్ ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటించగా... నాని సరసన రష్మిక మందన్న నటించింది.

అమ్మడుకి అన్నీ కలిసొస్తున్నాయా..?

మరి క్యూట్ క్యూట్ లుక్స్ తో ట్రెడిషనల్ గా అదరగొడుతున్న రష్మిక దేవదాస్ తో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడుతుందో.. లేదంటే యావరేజ్ తో నిలబడి హిట్ చేజార్చుకుంటుందో చూడాలి. ఇకపోతే దేవదాస్ టాక్ ఎలా ఉన్నప్పటికీ.. అమ్మడుకి మళ్లీ విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ ఆఫర్ ఉంది. మరి లుక్స్ పరంగా, నటనపరంగా, గ్లామర్ పరంగా, విజయ్ క్రేజ్, గీత గోవిందం హిట్ అన్నీ రశ్మికకు ప్లస్ పాయింట్స్. అసలే తన్నుకొస్తున్న అవకాశాల కోసం రష్మిక తన లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన ఎంగేజ్మెంట్ కూడా బ్రేకప్ చేసుకుంది. ఇకపోతే దేవదాస్ గనక హిట్ అయ్యిందా ఈ భామ వెనక దర్శక నిర్మాతలు క్యూ కట్టడం ఖాయం. అలాగే స్టార్ హీరోల చూపు పడినా పడొచ్చు మరి.

Similar News