రష్మిక ఎగ్జైట్మెంట్ చూసారా?

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ ఎవరయ్యా అంటే రష్మిక అంటారు. మహేష్ మాత్రమే కాదు.. నితిన్, అల్లు అర్జున్ జోడిగా రష్మిక సినిమాలు. పుష్ప లాంటి పాన్ [more]

Update: 2020-10-29 01:33 GMT

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ ఎవరయ్యా అంటే రష్మిక అంటారు. మహేష్ మాత్రమే కాదు.. నితిన్, అల్లు అర్జున్ జోడిగా రష్మిక సినిమాలు. పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న రష్మిక శర్వానంద్ లాంటి మీడియం హీరోతో జత కట్టడం చూస్తుంటే రష్మిక ఏ అవకాశం వదిలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషలను దున్నేస్తున్న రష్మిక తమిళనాట కార్తీ తో సుల్తాన్ సినిమాలో నటిస్తుంది. తోలి తమిళ సినిమాలో నటిస్తునం రష్మిక చాలా ఎగ్జైట్ అవుతుంది. తెలుగు, తమిళంలో విడుదల కాబోతున్న సుల్తాన్ సినిమా షూటింగ్ పూర్తి కావడం కార్తీ సుల్తాన్ లుక్ వదలడం జరిగింది.

అయితే ఆ సినిమాలో నటించడం తన అదృష్టమని, ఈ సినిమా సూపర్ అంటుంది. ఇంకా ఈ సినిమా గురించి చెబుతూ.. నా తొలి తమిళ సినిమా సుల్తాన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే.. నా చిన్నప్పుడు మా నాన్నతో కలసి చాలా తమిళ సినిమాలు చూశాను. కానీ నేను హీరోయిన్ అయ్యాక ఇప్పుడు ఇలా ఓ పెద్ద తమిళ సినిమాలో నటించడమే కాదు.. అద్భుతమైన వ్యక్తులతో కలసి నటించానన్నా, వాళ్లతో కలిసి పనిచేశానన్నా నమ్మశక్యంగా లేదు. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అంటూ ఎగ్జైట్ అవుతుంది. మరి మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా విషయంలోనూ రష్మిక ఇంతే ఎగ్జైట్ అయ్యింది. కాకపోతే ఆ సినిమాలో రష్మిక చేసిన ఓవేరేక్షన్ కి ప్రేక్షకులు రష్మికాని అప్పట్లో ఓ అట ఆడుకున్నారు.

Tags:    

Similar News