రష్మిక కి ఇంత క్రేజా!!

టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్స్.. ఇప్పుడు సినిమాల విషయంలో తెగ పోటీ పడుతున్నారు. పూజ హెగ్డే కి రష్మికకి వరసబెట్టి ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. పూజ కాస్త డల్ [more]

Update: 2020-11-24 07:29 GMT

టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్స్.. ఇప్పుడు సినిమాల విషయంలో తెగ పోటీ పడుతున్నారు. పూజ హెగ్డే కి రష్మికకి వరసబెట్టి ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. పూజ కాస్త డల్ అయినా.. రష్మిక మాత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాతో పాటుగా శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్న రష్మీకకి గూగుల్ గుడి కట్టిన విషయం తెలిసిందే. అయితే రశ్మికకి డ్రెస్సింగ్ స్టయిల్ నచ్చి గూగుల్ రశ్మికకి నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా గుర్తింపునిచ్చింది. అంత అరుదైన గుర్తింపు పొందిన రశ్మికకి ఇప్పుడో భారీ ఆఫర్ వచ్చిందట. అది కూడా కోలీవుడ్ నుండి అంటున్నారు.

అది తమిళనాట ఆకాశం నీ హద్దురా అంటూ ఎగిరిపోతున్న సూర్య సినిమాలో రశ్మికకి బంపర్ ఛాన్స్ వచ్చిందట. ఇప్పటికే తమ్ముడు కార్తీ సుల్తాన్ సినిమాలో నటిస్తున్న రష్మిక ఇప్పుడు అన్న సూర్య సినిమాలో ఛాన్స్ పట్టేసినట్టుగా టాక్. పాండియరాజ్ దర్శకత్వంలో సూర్య చెయ్యబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో రష్మికాని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా టాక్. మరి తెలుగులోనే కాదు.. రశ్మికకి తమిళంలోనూ భారీ క్రేజ్ వచ్చేసి లక్కీ హీరోయిన్ గా సెటిల్ అయ్యేలా కనబడుతుంది ప్రస్తుతం అమ్మడు వ్యవహారం. 

Tags:    

Similar News