తన బాధను బయటికి చెప్పేసిన రష్మిక..!

Update: 2018-09-18 06:58 GMT

కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ని స్టార్ట్ చేసి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రష్మిక. ఈ నేపథ్యంలో ఆమె కన్నడలో ‘వ్రిత్రా’ అనే మూవీ నుండి తప్పుకోవడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోడానికి కారణం ఎవరు..? ఎందుకని అంత సడన్ డెషిషన్ తీసుకుందో ఎవరికీ అర్ధం కానీ విషయం. అయితే అక్కడ మీడియా వారు చెబుతున్న దాని ప్రకారం ఆమె ‘వ్రిత్రా’ తప్పుకోవడానికి కారణం ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి అని తెలుస్తుంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసే గౌతమ్, రక్షిత్ మంచి స్నేహితులు. రష్మిక కి, రక్షిత్ కి బ్రేక్ అప్ కావడంతో అది ఇష్టం లేని డైరెక్టర్ గౌతమ్‌.. తన ఫ్రెండ్ రక్షిత్ కోసం ఆమెను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారని అక్కడ మీడియా చెబుతుంది.

భావోద్వేగానికి గురైన రష్మిక...

అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా రష్మిక చెవిన పడింది. దీంతో ఆమె ఏమీ ఆలోచించకుండా నిన్న ఉదయం ‘వ్రిత్రా’లో తాను నటించడం లేదని చెప్పేసింది. అయితే దీన్ని ఉద్దేశించి ఆమె.. "సోషల్ మీడియాలో నాపై వస్తున్న కథలు, కథనాలు, కామెంట్స్ అన్నీ చూస్తున్నా.. నేను చాలా రోజుల నుండి మౌనంగా వున్నాను. ఇవన్నీ రోజూ చూస్తూనే ఉన్నా. నాపై చిత్రీకరిస్తున్న విధానం పట్ల కలత చెందాను. అలాగని నేను ఎవరిని నిందించడం లేదు. ఎందుకంటే ఆలా జరిగి ఉండదని మీ నమ్మకం. ఏది నిజం ఏది అబద్దం అని చెప్పడానికి నేను ఇక్కడ లేను. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నా ఎవరికీ ఇటువంటి పరిస్థితి మాత్రం రాకూడదు. నాణేనికి రెండు ముఖాలు వుంటాయి. అది అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నా. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. ఎవరో ఏదో చెప్పినట్టుగా నేను కన్నడ పరిశ్రమకు దూరం కాను. నేను కన్నడ సినిమాలు చేస్తాను. మంచి రోల్స్ వస్తే తప్పకుండా కంటిన్యూ అవుతాను. ఏ భాషలోనైనా… ఏ ఇండస్ట్రీలోనైనా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను" అని తన మనసులో బాధ బయటికి చెప్పేసింది.

Similar News