రష్మిక ఫిక్స్ అంటున్న హీరో?

రష్మిక లక్కు మాములుగా లేదు. సరిలేరు, భీష్మ హిట్స్ తరవాత రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప తో పాన్ ఇండియా మూవీ చేస్తుంది. డీ గ్లామర్ [more]

Update: 2020-10-12 08:47 GMT

రష్మిక లక్కు మాములుగా లేదు. సరిలేరు, భీష్మ హిట్స్ తరవాత రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప తో పాన్ ఇండియా మూవీ చేస్తుంది. డీ గ్లామర్ గా రాయలసీమ యాసలో పుష్ప లో నటించబోతుంది. ప్రస్తుతం రష్మిక కి పుష్ప సినిమాకి సంబందించిన ఫోటో షూట్ కూడా జరిగి లుక్ ఫైనల్ చేసిందట పుష్ప టీం. అయితే ఇప్పుడు ఈ లక్కీ గర్ల్ కావాలంటున్నాడట ఓ యంగ్ హీరో. అతనే మూడు సినిమాల ప్లాప్స్ తో ఉన్న అక్కినేని హీరో అఖిల్. మూడు సినిమాల్తో హిట్ కొట్టలేకపోయిన అఖిల్ ఇప్పుడు ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ పూజ అందాలనే నమ్ముకున్న అఖిల్. తన తదుపరి మూవీ ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చెయ్యబోతున్నాడు.

అయితే దర్శకుడు సురేందర్ రెడ్డికి అఖిల్ ఓ విషయాన్నీ క్లియర్ గా చెప్పాడట. మన సినిమాలో రష్మిక ని హీరోయిన్ గా మాట్లాడమని. ప్రస్తుతం ఫేమ్ ఉన్న హీరోయిన్స్ లో పూజ, రష్మిక ఇద్దరే ఇద్దరు. అందుకే రేష్మక అయితే బావుంటుంది.. డేట్స్ కుదరకపోయినా అడ్జెస్ట్ చెయ్యమని అడగమని దర్శకుడు సురేందర్ రెడ్డిని అఖిల్ ఫోర్స్ చేస్తున్నాడట. ఎలాగూ పుష్ప తో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న రష్మిక హీరోయిన్ అయితే మన సినిమాకి బాగా హైప్ వస్తుంది. అందుకే ఆమెనే తీసుకుందామని చెబుతున్నాడట. మరి సురేందర్ రెడ్డికి ముందు నుండి రష్మీకి హీరోయిన్ అయితే బావుంటుంది అనుకుంటున్నాడట. మరి రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చెయ్యగలిగితే అఖిల్ నెక్స్ట్ లో ఆమె హీరోయిన్ అంటున్నారు.

Tags:    

Similar News