అందులో ఏముందని.. తెగ పొగుడుతున్నావ్!!

ప్రస్తుతం థియేటర్స్ మూత పడడంతో… చిన్న సినిమాలు అన్ని ఓటిటి దారి పడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఓటిటి లలో విడుదలైన సినిమాలేమి ప్రేక్షకులకు ఆశాజనకంగా అనిపించలేదు. అంటే [more]

Update: 2020-06-25 02:47 GMT

ప్రస్తుతం థియేటర్స్ మూత పడడంతో… చిన్న సినిమాలు అన్ని ఓటిటి దారి పడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఓటిటి లలో విడుదలైన సినిమాలేమి ప్రేక్షకులకు ఆశాజనకంగా అనిపించలేదు. అంటే సినిమాలు థియేటర్స్ లో ఆడవని నమ్మేవారు ఆ సినిమాలను ఓటిటి లలో వదులుతున్నారనిపించేలా ఓటిటిలో విడుదలైన సినిమాలు చూస్తే అనిపిస్తుంది. అయితే తాజాగా మహానటి తో క్రేజీ హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్ పెంగ్విన్ భారీ అంచనాలు, ప్రమోషన్స్ మధ్యన ఓటిటిలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్ తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు సినిమా విడుదలయ్యాక కనబడలేదు. ఇక పెంగివిన్ ఒత్తిడిలో విడుదల తర్వాత ఆ మూవీ టీం ఏది ఇప్పటివరకు మాట్లాడింది లేదు.

అయితే ఆ సినిమాని ఓటిటిలో చూసి తన స్పందనని తెలపడమే కాదు.. కీర్తి సురేష్ సినిమాని ఓ హీరోయిన్ తెగ పొగిడేస్తోంది. ఈ ఏడాది లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక రెండు రోజుల క్రితమే పెంగ్విన్ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో వీక్షించిందట. వెంటనే తన ఇన్ స్టా వేదికగా  పెంగ్విన్ సినిమాని ఓటిటిలో చూశాను.. కీర్తీ, నువ్వు కీలకం.. ఎప్పటిలానే నీ అభినయం అద్భుతం. ఈ సినిమా అందరు తల్లులకూ సంబంధించింది. ఈశ్వర్, సుబ్బరాజు సర్.. అందరికీ అభినందనలు.. అంటూ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపింది. అయితే ఆ సినిమాని చూసిన నెటిజెన్స్ ఎమ్మా ఖాళీగా ఉండి షూటింగ్స్ లేక సినిమా చూస్తే చూసావు.. కాని అందులో ఏముందని.. అంతలా పొగుడుతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News