రష్మీ అంతకుమించి లో ఏం లేదు

Update: 2018-08-26 05:27 GMT

నిన్న నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులో ఒక్కటి రష్మీ నటించిన 'అంతకు మించి' చిత్రం. రష్మీ అందాలని..తన తొడలని కుర్రకారులకు ఏర వేస్తూ రిలీజ్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందొ ఓ చిన్నపాటి రివ్యూలో చూసేద్దాం రండి. ఒక ఇంట్లో దెయ్యం ఉందని రుజువు చేస్తే 5 కోట్లు ఇస్తామని తెలుసుకున్న హీరో ( జై ) అతనికి తోడుగా హీరోయిన్ ( రష్మీ ) కూడా ఉంటుంది.

ఈ నేపథ్యంలో తన సోదరి ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరగటం గమించిన రాజు వేటను తీవ్రం చేస్తాడు. మరి ఆ ఇంట్లో దెయ్యం ఉందా లేదా అన్నది మిగతా కథ. టీజర్స్ లో చూపించినట్టు రష్మీ అందాలు తప్ప సినిమాలో విషయం ఏమి లేదు. క్లైమాక్స్ సీన్ లో మాత్రం రష్మీ నెగటివ్ షేడ్ లో ఆకట్టుకుంది. ఇక హీరో జై మాత్రం రష్మీతో సీన్స్ లో రెచ్చిపోయాడు. ఇక మిగిలిన ఆర్టిస్ట్స్ గురించి చెప్పడానికి ఏమి లేదు.

ఇక డైరెక్టర్ జానీ ఈ సినిమాను తీయడం లో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ దాకా మొత్తం బోరే. సునీల్ కశ్యప్ సంగీతం కొంచం పర్లేదు అనిపించింది. ఓవర్ అల్ గా ఇది ఒక నాసిరకం చిత్రం. ఈ సినిమా కోసం మన టైం వేస్ట్ చేయడం తప్ప ఇంకా ఇంకేమి లేదు. ఒకేవేళ ఇది టీవిలో వచ్చిన చూడటం వేస్ట్.

Similar News