ఇష్టమైన హీరోయిన్ సమంత అంటున్న మరో హీరోయిన్!!

కరోనా లాక్ డౌన్ తో హీరో, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులల్తో పర్సనల్ విషయాల దగ్గరనుండి, సినిమా విషయాల వరకు పంచుకుంటూనే ఉన్నారు. అభిమానులు అడిగిన [more]

Update: 2020-05-04 06:16 GMT

కరోనా లాక్ డౌన్ తో హీరో, హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులల్తో పర్సనల్ విషయాల దగ్గరనుండి, సినిమా విషయాల వరకు పంచుకుంటూనే ఉన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా ఛానల్ లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా.. తెలుగు ప్రేక్షకులు నా ప్రాణం అని చెప్పింది. ఇక తనకు నచ్చిన మూవీ ద ప్రపోజల్ అని చెప్పింది.

ఇక కోలీవుడ్ దర్శకుల్లో తనకు నచ్చిన దర్శకులు వెట్రిమారన్ సార్, శంకర్ సర్, మణిరత్నం సర్ మరియు అట్లీ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పిన రాశి ఖన్నా… అజిత్ అంటే చార్మింగ్ హీరో అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులో మీకిష్టమైన హీరోయిన్ ఎవరు అనగానే.. టక్కున రాశి ఖన్నా సమంత అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఇక అల్లు అర్జున్ గురించి అడగగా… దానికి రాశి ఖన్నా.. అల్లు అర్జున్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాడు. బన్నీ వర్క్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ తో నటించడానికి ఇష్టపడతాను అంటూ బన్నీకి గేలం వేసింది రాశి ఖన్నా.

Tags:    

Similar News