మొత్తానికి రాశి ఖన్నాకి పని జరిగింది!!

ఈమధ్యన అవకాశాలు లేని రాశి ఖన్నా సోషల్ మీడియానే నమ్ముకుంది. బలమైన పీఆర్ టీమ్ తో పబ్లిసిటీ టెక్నీక్స్ తో రాశి ఖన్నా సోషల్ మీడియాలో హంగామా [more]

Update: 2020-10-22 07:20 GMT

ఈమధ్యన అవకాశాలు లేని రాశి ఖన్నా సోషల్ మీడియానే నమ్ముకుంది. బలమైన పీఆర్ టీమ్ తో పబ్లిసిటీ టెక్నీక్స్ తో రాశి ఖన్నా సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఒకసారి హాట్ గా.. క్లివేజ్ షో తో హాటెస్ట్ ఫోజులతో సోషల్ మీడియాని ఊపేసింది. కాస్త బొద్దుగా ఉండే రాశి ఖన్నా జిమ్ లో బాగా వర్కౌట్స్ చేసి నాజూగ్గా తయారైంది. మంచి ఫిట్ నెస్ తో రాశి ఖన్నా ఇప్పుడు గ్లామర్ షో ని భీభత్సంగా చేసేస్తుంది. ఎప్పుడు గ్లామర్ గర్ల్ లా ఫోజులు కొట్టే రాశి ఇప్పుడు మరింత గ్లామర్ గా తయారైంది. ఇక హాట్ అండ్ క్లివేజ్ షో ఓ ఎత్తైతే తాజాగా రాశి ఖన్నా విలేజ్ గెటప్ మరో ఎత్తు.

రాశి ఖన్నా లంగా వోణి తో అదరగొట్టింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా రాశి ఖన్నా విలేజ్ లంగా వోణి గెటప్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. రాశి ఖన్నా పల్లెటూరి గెటప్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసి వైరల్ చేసారు. అయితే రాశి ఖన్నా సోషల్ మీడియాలో రకరకాల గెటప్స్ రకరకాల ఫోజులతో నానా కష్టాలు పడుతుంది. కానీ ఆఫర్స్ రావడం లేదు. అయితే తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ రాశి ఖన్నాని వెతుక్కుంటూ వచ్చింది అని అంటున్నారు. అది కూడా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి సరసన రాశి ఖన్నా ఆఫర్ పట్టేసింది. అయితే విజయ్ సేతుపతి ఈ తుగ్లక్ దర్బార్ చిత్రం లో ముందుగా మరో హీరోయిన్ అదితి రావు హైదరి ని తీసుకున్న యూనిట్ ఇప్పుడు అదితి రావు హైదరి ని తప్పించి రాశి ఖన్నాని విజయ్ సేతుపతి సరసన ఫైనల్ చేశారట. మరి సోషల్ మీడియాని నమ్ముకునేందుకు రాశి ఖన్నాకి గట్టిగానే పని జరిగింది.

Tags:    

Similar News