నేను ఆ హీరో పక్కన నటించడం లేదు..!

Update: 2018-12-15 08:36 GMT

ఈ ఏడాది తొలిప్రేమతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాశి ఖన్నా... శ్రీనివాస కల్యాణంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుంది. రాశి ఖన్నాకి అందం, అభినయం ఎంత ఉన్నా లక్కే లేదు. అందుకే స్టార్ హీరో ఎన్టీఆర్ పక్కన నటించిన... అమ్మడుకి లక్కనేది కలిసి రావడం లేదు. చిన్నాచితక హీరోలతోనే సర్దుకుపోతున్న రాశి యాక్షన్ హీరో గోపిచంద్ సరసన ఒక సినిమాలో నటించబోతుంది అంటూ గత రెండు రోజులుగా ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. గతంలోనే గోపీచంద్ - రాశి ఖన్నా కలిసి జిల్, ఆక్సిజెన్ సినిమాల్లో నటించారు. అయితే ఆ రెండు సినిమాలూ డిజాస్టర్ సినిమాలే. తాజాగా గోపీచంద్ తో రాశి ఖన్నా మరోసారి నటించబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో రాశి ఖన్నా స్వయంగా స్పందించింది.

మరి గోపీచంద్ పక్కన ఎవరు..?

తాను గోపీచంద్ సినిమాలో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పడంతో ఎట్టకేలకు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. మరి గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న గోపీచంద్ ఈ సారి తమిళ డైరెక్టర్ ని నమ్ముకున్నాడు. డైరెక్టర్ తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాతగా తెరకెక్కతున్న సినిమాలో గోపీచంద్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ పక్కన నటించబోయే ఆ హీరోయిన్ ఎవరనేదాని మీద అందరిలో ఆసక్తి నెలకొంది.

Similar News