ఆమె ఛాన్స్ తన్నుకుపోయిన రాశీ ఖన్నా

ప్రస్తుతం నాభ నటేష్ రవితేజ పక్కన డిస్కో రాజా సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రెండుమూడు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్న నాభ నటేష్ [more]

Update: 2019-02-22 07:30 GMT

ప్రస్తుతం నాభ నటేష్ రవితేజ పక్కన డిస్కో రాజా సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రెండుమూడు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్న నాభ నటేష్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ యాంగిల్స్ తో ఫొటోస్ దిగుతూ పర్సనల్ పీఆర్ టీం ద్వారా మంచి పబ్లిసిటీ చేసుకుంటుంది. తాజాగా నాభ నటేష్ కి ఒక యంగ్ హీరో పక్కన ఛాన్స్ వచ్చిందని.. రకుల్ ప్రీత్ ప్లేస్ లోకి నాభ నటేష్ ని తీసుకుంటున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరిగింది. అది కూడా వెంకీ మామ అనే మల్టీస్టారర్ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా కుర్ర హీరోయిన్ నాభ నటేష్ ని తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. దీంతో రకుల్ లక్కుని కొట్టేసిన నాభ అన్నారు.

నాభ స్థానంలో రాశీ ఖన్నా

కానీ తాజాగా నాభ నటేష్ కి అంత సీన్ లేదని.. ఆమెని కాదని మరో హీరోయిన్ కి నాగ చైతన్య ఓటేసాడనే టాక్ మొదలైంది. వెంకీ మామ సినిమాలో నాగ చైతన్యకి జోడిగా మొదట్లో రకుల్ ప్రీత్ ని ఎంపిక చెయ్యగా ఆమె తప్పుకోవడంతో నాభ పేరుని పరిశీలించారు. చైతు మాత్రం తొలిప్రేమతో మళ్లీ లైం టైంలోకొచ్చిన రాశి ఖన్నాకి ఓటేసాడట. అయితే రాశి ఖన్నాకి తొలిప్రేమ హిట్ ఉన్నప్పటికీ… నితిన్ తో కలిసి చేసిన శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ నాగ చైతన్య, రాశి ఖన్నా అయితే బాగుంటుందని దర్శకుడు బాబీకి నిర్మాత, మేనమామ అయిన సురేష్ బాబుకి చెప్పగా.. ప్రస్తుతం సురేష్ బాబు రాశి ఖన్నాతో సంప్రదింపులు జరుపునున్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. మరి నాభ నటేష్ కి అలా అదృష్టం తలుపు తట్టినట్లే తట్టి మాయమైంది.

Tags:    

Similar News