రాశి టైం స్టార్ట్ అయ్యింది..!

బబ్లీ గర్ల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా స్టార్ హీరోల పక్కన నటించకపోయినా.. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కాకపోతే అమ్మడుకి స్టార్ [more]

Update: 2019-01-29 08:03 GMT

బబ్లీ గర్ల్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా స్టార్ హీరోల పక్కన నటించకపోయినా.. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కాకపోతే అమ్మడుకి స్టార్ హీరోల పక్కన సినిమాలు చెయ్యాలని ఉన్నా ఆఫర్స్ ఇవ్వాలి కదా. ఏదో జై లవ కుశలో ఎన్టీఆర్ సరసన చెయ్యడానికి పాత్ర దొరికింది కానీ ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక గతేడాది వరుణ్ సరసన తొలిప్రేమ సినిమాలో నటించి సాలిడ్ హిట్ అందుకుంది. కానీ రాశికి మాత్రం స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు. కానీ తాజాగా హిట్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేసి రాశి టైం స్టార్ట్ అంటోంది ఈ భామ. బబ్లీ లుక్స్ నుండి జీరో లుక్స్ లోకి మరిన రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్న విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసింది.

తెలుగు.. తమిళ సినిమాల్లో…

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మరి విజయ్ సరసన రాశి అంటే.. మాములు విషయం కాదు. ఇక తెలుగులో మత్రమే కాదు.. తమిళంలోనూ విజయ్ సేతుపతి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది రాశి. 96 హిట్ తో ఉన్న విజయ్ సేతుపతి సరసన రాశి ఈ సినిమాని విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయబోతుంది. ఈ సినిమా మొత్తం గ్రామీణ నేప‌థ్యంలో సాగుతుందట‌. మరి ఈ సినిమాలో రాశి లంగా ఓణీత ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చెయ్యబోతుందన్న మాట. అలాగే శింబు సరసన వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న సినిమాలోనూ రాశి ఖన్నానే హీరోయిన్. ఈ వార్తలు చూశాక.. రాశికి అవకాశాలు లేదన్నది ఎవరు.. చూడండి రాశి ఖన్నా టైం ఎలా మొదలైందో అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News