రాశి ఖన్నా భలే చెప్పింది..!

Update: 2018-09-27 10:29 GMT

టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ లో రాశి ఖన్నా ఒక్కరు. ఈ అమ్మడు యాక్టింగ్ తో పాటు సింగింగ్ కూడా చేసింది. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పడడమే కాదు కవితలతో కూడా మెపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆమెలో మరో టాలెంట్ కూడా ఉందని చెబుతుంది. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని ఇప్పటివరకు దాన్ని సరైన రీతిలో బయట పెట్టలేదని..అవసరం అయితే ఆ యాంగిల్ ను కూడా ప్రదర్శించగలనని చెప్పింది. ఈమె 'పటాస్' సినిమాలో శ్రీదేవి పాత్రతో ఎలా అలరించిందో మన చూసాం.

పోటీ ఉండాల్సిందే... కానీ...

అవకాశం వస్తే కామెడీ యాంగిల్ ను ప్రదర్శిస్తా అంటున్న ఈ భామ ఏ పరిశ్రమలో అయినా పోటీ ఉంటుందని అలానే సినీ పరిశ్రమలో కూడా ఉందని.. ఓ మనిషి ఎదగాలంటే పోటీ చాలా అవసరం అని చెబుతుంది. పోటీ లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతాం అని.. నేను పోటీని ఎప్పుడూ స్వీకరిస్తానని తెలిపింది. కానీ ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని చెబుతుంది. తాను, రకుల్, రెజినా ప్రొఫెషన్ పరంగా ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటామని.. ఆ పోటీ అనేది వర్క్ పరంగానే అని... షూటింగ్ ప్యాక్ అప్ అయిన తర్వాత తామంతా స్నేహితులమేనని తెలిపింది.

Similar News