భార్య భర్తలిద్దరూ మ్యాజిక్ చేస్తారట

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో హీరోయిన్ ప్రేమించి పెళ్లాడారు అంటే ఆ జంట మీద అనుక్షణం మీడియా ఫోకస్ కాదు.. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. టాలీవుడ్ [more]

Update: 2019-06-12 08:20 GMT

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో హీరోయిన్ ప్రేమించి పెళ్లాడారు అంటే ఆ జంట మీద అనుక్షణం మీడియా ఫోకస్ కాదు.. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. టాలీవుడ్ లో చైతు – సామ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లాడక ముందు మూడు సినిమాల్లో కలిసి నటించిన రాని క్రేజ్ పెళ్లయ్యాక వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించేసరికి ఎక్కడ లేని అంచనాలు ఆ సినిమాపై వచ్చేసాయి. అదే ఊపులో భార్య భర్తలుగా నటించిన మజిలీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అక్కినేని అభిమానులల్తో పాటుగా.. మిగతా ప్రేక్షకుల ఆశ మజిలీతో తీరిపోయింది. ఇప్పుడు తాజాగా మరో జంట పెళ్లాడిన తర్వాత కలిసి నటించబోతున్నారు.

వారెవరో కాదు బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొనే. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే పెళ్ళికి ముందు ప్రేమలో ఉండగా మూడు సినిమాల్లో నటించారు. రామ్ లీలా, బాజీ రావ్ మస్తానీ తో పాటుగా పద్మవత్ చిత్రాల్లో నటించారు. వెండితెర మీద అద్భుతమైన కెమిస్ట్రీ పండించే ఈ జంట పెళ్లి తర్వాత కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. అటు రణ్వీర్ సింగ్ అభిమానులల్తో పాటుగా దీపికా అభిమానులు కూడా వీరిద్దరూ కలిసి నటిస్తే బావుంటుందని అంటున్నారు. అయితే తాజాగా ఆ ముచ్చట తీరుతుంది. 1983 భారత్ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కుతోన్న 83 బయోపిక్‌లో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర ని పండించడం కోసం రణ్వీర్ క్రికెట్ కూడా నేర్చుకున్నాడు. అయితే ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కపిల్ భార్య రోమి భాటియా పాత్రలో దీపికా పదుకొనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. అప్పుడే ఆ సినిమాలో జాయిన్ కూడా అయ్యింది. క్రికెట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన కపిల్‌కు వ్యక్తిగత జీవితంలో అండగా నిలిచిన…. కపిల్ దేవ్ విజయంలో తన వంతు సాయం చేసిన రోమి భాటియా పాత్రకు మంచి స్కోప్ ఉండడంతో.. ఆపాత్రకి దీపికా అయితేనే న్యాయం చేస్తుందని భావించిన దర్శకనిర్మాతలు.. ఆ పాత్ర కోసం దీపికాను తీసుకున్నారు. ఇక దీపికా – రణ్వీర్ లు కలిసి నటిస్తున్నారు అనగానే ఆ సినిమాపై అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి.

Tags:    

Similar News