మొగుడు పెళ్ళాల వంట గోల!!

బాలీవుడ్ లో క్యూట్ అండ్ లవ్లీ కపూర్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొణెలు ఏళ్లకు ఏళ్ళు ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ క్రేజియస్ట్ [more]

Update: 2020-05-26 06:34 GMT

బాలీవుడ్ లో క్యూట్ అండ్ లవ్లీ కపూర్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొణెలు ఏళ్లకు ఏళ్ళు ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ క్రేజియస్ట్ జంటగా దీపికా పదుకొనే, రణ్వీర్ లు ఉంటారు. రణ్వీర్ ఎనెర్జీ, దీపికా పదుకొనె అందం హైట్ అన్నిటిలో ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఈ ఇద్దరు భార్య భర్తలు కెరీర్ లోను ఎప్పుడూ బిజినే. ఇద్దరూ కలిసి ఏ ఏడాది 83 లో నటించారు. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఇంట్లోనే గడుపుతున్న రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పదుకొనేలా వంట ముచ్చట్లు సోషల్ మీడియాకి ఎక్కాయి. రణ్వీర్ సింగ్ దీపికా ని పెళ్లి చేసుకోకముందు ఎన్నో గిఫ్ట్స్ అవి ఇస్తూ ఇంప్రెస్స్ చేసేవాడట. బొకేస్, గిఫ్ట్స్ ఇలా చాలా ఇచ్చిన రణ్వీర్ దీపికాలు అన్ని అర్ధం చేసుకుని లవ్ లో పీక్స్ కి వెళ్ళాక రణ్వీర్ సింగ్ దీపికకి ఓ మాటిచ్చాడట. దీపికా కోసం స్పెషల్ గా భోజనం వండుతా అని మాటిచ్చాడట. కానీ ఇంతవరకు రణవీర్ పని చేయలేదట.

గతంలో అమెరికాలో ఉన్నప్పుడు బట్టర్ చికెన్ చేసి ఫ్రెండ్స్ కి పెట్టేవాడట కాని.. అది చీటింగ్ చికెన్ అని, కేవలం అన్ని మిక్స్డ్ తో ఉన్న చికెన్ తెచ్చి వండేవాడినని చెబుతున్నాడు. ఇక తనకి గుడ్లు వండడం బాగా వచ్చని చెబుతున్నాడు. ఇక దీపికా పదుకొనె కి వంట చెయ్యడం చాలా ఇష్టమని, అందుకే ఈ సమయంలో తనకి వంట గది అప్పజెప్పా అని… అయితే దీపికా వంట చేస్తుంటే తాను హెల్ప్ చేస్తా అంటున్నాడు. తనకి అసిస్టెంట్ గా అన్ని దగ్గరుండి చూసుకుంటా అని చెప్పిన రణ్వీర్ కి దీపికా అదిరిపోయే కౌంటర్ వేసింది. అసలు రణ్వీర్ చెప్పేవన్ని అబద్దాలే. తనకి గుడ్లు వండడం కూడా రాదు.. వస్తే లైవ్ లోనే గుడ్లు వండి చూపించాలని ఛాలెంజ్ చేసింది. దానితో రణ్వీర్ రేపు బ్రేక్ ఫాస్ట్ చేస్తా అంటూ దీపికా ఛాలెంజ్ స్వీకరించాడు.

Tags:    

Similar News