యూట్యూబ్ లో రంగమ్మా హావ

Update: 2018-09-17 08:15 GMT

ఈఏడాది బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏంటంటే మరో మాటా లేకుండా 'రంగస్థలం' అని చెప్పేవచు. రామ్ చరణ్ - సమంత జంటగా నటించిన సుకుమార్ దర్శకత్వం వహించిన ఈసినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే. ఈచిత్రానికి చరణ్ - సామ్ నటనతో పాటు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా అందులో ‘రంగమ్మా మంగమ్మా' పాట సూపర్ హిట్ అయింది. ఆడియో సాంగ్ ఎంతైతే హిట్ అయిందో..సినిమా రిలీజ్ అయినా తర్వాత అంటే నెల రోజులకి ‘రంగమ్మా మంగమ్మా’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే దానికి అంతే క్రేజ్ వచ్చింది.

అయితే ఆ పాట యూట్యూబ్ లో లేటెస్ట్ గా 10 కోట్ల వ్యూస్ మార్కును అందుకోవడం విశేషం. రిలీజ్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ పాట కోటి పైగా వ్యూస్ సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ నాలుగున్నర నెలల్లోనే 10 కోట్ల మార్కును అందుకుంది. దేవిశ్రీ ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ కి ట్యూన్ ఇవ్వటం.. దానికి తోడు ఎం.ఎం.మానసి హస్కీ వాయిస్‌ ఈపాటకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక చంద్రబోస్ సాహిత్యం కూడా పాటకు ఆకర్షణగా నిలిచింది. గతంలో ‘సాహోరే బాహుబలి’, ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ లాంటి తెలుగు సాంగ్స్ యూట్యూబ్ లో 10 కోట్ల వ్యూస్ మాత్రమే తెచ్చుకున్నాయి.

ఇప్పుడు ఆ లిస్ట్ లో ఈ పాట కూడా చేరింది. వీటన్నిటికీ తోడు సామ్ డాన్స్ మరియు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులు ఫిదా అయ్యిపోయారు. సామ్ ఎన్నడూ లేని విధంగా పల్లెటూరు అమ్మాయి గా కనిపించడం ఈ సక్సెస్ కి ప్లస్ అయింది.

Similar News