'రంగస్థలం' విజయోత్సవం స్టేజ్ మీద....!!

Update: 2018-04-14 06:17 GMT

'రంగస్థలం' సినిమా విడుదలై 15 రోజులు పూర్తయినా దాని హవా ఎక్కడా...ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'రంగస్థలం' విజయోత్సవ వేడుకల్ని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకి రంగస్థలం టీమ్ మొత్తం చాలా ట్రెడిషనల్ గా పంచెకట్టుకుని పద్దతిగా వచ్చారు. సుకుమార్, దేవిశ్రీ, రామ్ చరణ్, రత్నవేలు, నిర్మాతలు ఇలా అందరూ అందమైన పంచెకట్టుతో దర్శనమియ్యగా... ఆఖరికి రామలక్ష్మి అదేనండీ సమంత కూడా చక్కటి చీరకట్టులో మెరిసింది. కానీ రంగమ్మత్తే...కాస్త హాట్ గా కనిపించింది. ఈ వేడెక్కకి హాజరయిన అనసూయ కాస్త హాట్ గా మోడరన్ లుక్ లో కనిపించింది. ఇకపోతే ఈ వేడుకకి స్పెషల్ ఎట్రాక్షన్ పవన్ కళ్యాణ్ అయ్యాడు. చరణ్ తన బాబాయ్ తో కలిసి ఈ రంగస్థలం వేడుక మీద సందడి చేసాడు.

స్టెప్టులు వేస్తూ.....

ఇక రంగస్థలం స్టేజ్ మీద సుకుమార్, దేవిశ్రీ, జానీ మాస్టర్, రత్నవేలు ఇలా అందరూ 'ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాణీ.. కన్నయినా కొట్టవే జిగేల్ రాణి' స్టెప్పులు వేస్తూ ఫాన్స్ ని ఉర్రుతలూగించారు. ఇక వారితో జాయిన్ అయిన రామ్ చరణ్ కూడా డాన్స్ తో అదరగొట్టేసాడు. ఇక వారలా స్టేజ్ మీద డాన్స్ తో అదరకొట్టేయ్యగా...ఫాన్స్ విజిల్స్, కేకలతో ఆ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది. ఇక 'రంగస్థలం' విజయోత్సవం లో మాట్లాడిన రామ్ చరణ్ తన బాబాయ్ ని చూస్తే నోట మాటరావడం లేదని.. కనీసం వెనక చూసి మాట్లాడదామన్న ... సముద్రమంత అభిమానం చూసి మాటలు రావడం లేదంటూ హాస్యం చేసాడు చరణ్.

ముగ్గురు రియక్షన్.....

తన ఈ 'రంగస్థలం' సినిమా చూసి ముగ్గురు ఇచ్చిన రియాక్షన్ తానెప్పటికీ మరిచిపోలేనని... అందులో తన తల్లి, తండ్రి సినిమా చూసాక.. మాటరాలేదని.. అమ్మ అయితే ఏడ్చేసింది.. ఆమె రియాక్షన్ తో నా మనసు నిండిపోయిందని చెప్పిన రామ్ చరణ్... తన సినిమా హిట్ అయ్యింది కదా అందుకే బాబాయ్ పవన్ కి ఫోన్ చేసి రంగస్థలాన్ని సినిమా చూడమని అడుగుదామనుకున్నా ... కానీ ఈలోపే బాబాయ్ ఫోన్ చేసి ఇంటికి రారా అనిపిలిచాడు. ఇంటికెళ్లిన నాతో సినిమా చూస్తామని చెప్పడం తో ఆనందంతో నాకు కడుపు నిండిపోయింది. అయితే ఇంట్లోనే షో వేయిస్తానంటే వద్దు అంటే.. సరే ప్రివ్యూ థియేటర్ లో చూద్దామా అని అడిగితె ఛీ వద్దు అనేశాడు. బాబాయ్ ఫాన్స్ తో కలిసి 'రంగస్థలం' సినిమా చూద్దామని చెప్పడంతో అలా ఆరెంజ్ చేశానంటూ చెప్పిన చరణ్ తన బాబాయ్ 'తొలిప్రేమ' సినిమాని థియేటర్ లో చూసిన ఆయన మళ్ళీ రంగస్థలమే థియేటర్ లో చూశారట... అంటూ తన బాబాయ్ కి అభిమానులు, మీడియా, రంగస్థలం టీమ్ మధ్యలో థాంక్స్ చెప్పాడు.

Similar News