మూడు నిమిషాల్లో సినిమా మొత్తం చూపించేశారు!!

Update: 2018-04-14 09:05 GMT

సినిమాకు సంబంధించి ప్రొమోషన్స్ కోసం టీజర్స్..ట్రైలర్.. రిలీజ్ చేసి సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. అయితే ఒకే సినిమాకు సంబంధించి రెండు ట్రైలర్స్ రిలీజ్ చేయటం చూశారా. కనీసం విన్నారా. ఇలా రెండు దశాబ్దాలకు పూర్వం ఈ ట్రెండ్ ఉండేది. జనాలను థియేటర్స్ కి రపించేందుకు సినిమా రిలీజ్ కు ముందు ఒక ట్రైలర్ సినిమా తర్వాత ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేసేవారు. ఇది ఒకప్పుడి ట్రెండ్.

ఓల్డ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ....

ప్రస్తుతం ఈ ఓల్డ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ రంగస్థలం టీమ్ నిన్న ఇంకో ట్రైలర్ ను రిలీజ్ చేసింది. నిన్న సక్సెస్ మీట్ సందర్భంగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. సాధారణంగా సినిమా ట్రైలర్ అంటే 1.50 నుండి 2.50 నిమిషాల మధ్య నడవిడిలో ఉంటుంది. కానీ నిన్న విడుదల చేసిన ఈ ట్రైలర్ 3.40 పైనే ఉంది.

ఈ కాన్సెప్ట్ బాగుంది కదూ....

చాలా ఏళ్ల తర్వాత ఇలా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడం అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంది. ఈ మూడు నిమిషాల సినిమా అంతటినీ చూపించేశారు రంగస్థలం టీం. ఒకటి రెండు మినహా రంగస్థలంలోని కీలక సన్నివేశాలను.. దాదాపు అదే స్క్రీన్ ప్లేతో కట్ చేయడం మరీ విశేషం. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్స్ మోత మోగిస్తుంది. ఇక ఈ ట్రైలర్ తో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Similar News