రంగస్థలానికి అంత సీనుందా...?

Update: 2018-06-11 10:47 GMT

టైటిల్ చూసి కంగారు పడకండి. రామ్ చరణ్ - సుకుమార్ లు రంగస్థలంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారో తెలిసిందే. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన రంగస్థలం క్లోజింగ్ కలెక్షన్స్ అక్షరాలా 127 కోట్లు. తెలుగు నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మరీ ఆ లెవల్లో కలెక్షన్స్ కొల్లగొట్టడం అంటే మాటలు కాదు. నాన్ బాహుబలి రికార్డులతో రంగస్థలం మాములుగా హిట్ అవలేదు. ఈ సినిమాతో మైత్రి మూవీస్ వారు బాగానే లాభ పడ్డారు. గత కొంతకాలంగా రెండు వారాల్లో భారీ హిట్ కొట్టిన సినిమాలను కూడా థియేటర్స్ నుండి లేపేస్తున్న పరిస్థితితుల్లో రంగస్థలం లాంగ్ రన్ తో అదరగొట్టింది.

భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది...

ఇక సినిమా విడుదలయ్యాక రెండు నెలలోనే డిజిటిల్ హక్కుల కింద అమెజాన్ ప్రైమ్ వారు రంగస్థలాన్ని ఇంటర్నెట్ లో పెట్టెయ్యడం.. అక్కడ కూడా రంగస్థలం బంపర్ హిట్ అవడం జరిగింది. అలాగే రంగస్థలం నిర్మాతలు ఈ చిత్రాన్ని వేర్వేరు భారతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. త్వరలోనే తమిళం,మలయాళం, హిందీ, భోజ్ పురి వెర్షన్లు ఒకదాని తర్వాత ఒకటి రిలీజవుతాయని చెబుతున్నారు. మరీ ఈ విధంగానూ రంగస్థలం నిర్మతలు క్యాష్ చేసుకోవాలని చూడడం పెద్ద విచిత్రమేమి కాదు గానీ ఇప్పుడు వారి ఆలోచనలు చూస్తుంటే.. మాత్రం రంగస్థలానికి అంత సీనుందా అనిపిస్తుంది.

చైనాలోనూ విడుదల చేస్తారా..?

మైత్రి మూవీ వారు రంగస్థలం సినిమాని చైనాలోనూ విడుదల చేయాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. గత రెండు మూడేళ్లలో భారతీయ చిత్రాలకు చైనాలో ఆదరణ పెరిగిన మాట వాస్తవమే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలు చైనా బాగా ఆడుతున్నాయి. భజరంగి భాయిజాన్, హిందీ మీడియం లాంటి సినిమాలకూ అక్కడ మంచి ఆదరణ దక్కింది. ఇక మన తెలుగు దిగ్గజం బాహుబలి ది కంక్లూజన్ కూడా చైనా లో పర్వాలేదనిపించే కలెక్షన్స్ తెచ్చుకుంది. కానీ రంగస్థలం సినిమా తెలుగు నేటివికి దగ్గరగా ఉండడంతో.. ఆ సినిమా చైనా లో నెగ్గగలదా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. బాహుబలి భారీ ప్రమోషన్స్ తో చైనాలో విడుదల చేస్తేనే అక్కడ బాహుబలి కలెక్షన్స్ అంతంత మాత్రంగా వున్నాయి. మరీ బాహుబలి రేంజ్ లో మైత్రి వారు రంగస్థలాన్ని చైనా లో విడుదల చేయగలుగుతారా.. ఒకవేళ భారీగా ఖర్చు పెట్టి విడుదల చేస్తే ఖర్చులయినా వస్తాయా అనే అనుమానం అందరిలోనూ ఉంది..!

Similar News