చరణ్.. మహేష్ ని బీట్ చేసాడు!

Update: 2018-06-27 09:21 GMT

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమా ఎన్నో రికార్డ్స్ ను నెలకొలిపింది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో 'రంగస్థలం' సినిమా కలెక్షన్స్ పరంగా, టాక్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా మరో కొత్త రికార్డు బద్దలుకొట్టింది. హైదరాబాద్ లో కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతుంటారు.

పోకిరి రికార్డు బద్దలు

అలానే 'రంగస్థలం' సినిమా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాల్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' పేరిట ఉండగా, దాన్ని 'రంగస్థలం' బ్రేక్ చేసింది. 12 సంవత్సరాల క్రితం విడుదలైన 'పోకిరి', సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో రూ.1,61,43,081 వసూలు చేసింది.

89 రోజుల్లో...

అయితే 'రంగస్థలం' మాత్రం రిలీజ్ అయిన 89 రోజుల్లో రూ. 1.62 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి. అప్పుడు ఉన్న టికెట్ రేట్స్ వేరు ఇప్పుడు ఉన్న టికెట్ రేట్స్ వేరు. అంటే అప్పటి రేట్స్ కి ఇప్పటి రేట్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. కానీ రికార్డు రికార్డే కదా!

Similar News