యూఎస్ లో రికార్డు క్రియేట్ చేసిన రంగస్థలం

Update: 2018-04-09 05:54 GMT

సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రోజురోజుకి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ నటీనటుల కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలించింది.

లేటెస్ట్ గా ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి సినిమా తర్వాతి స్తానంలో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది.

ఓవర్సీస్ లో రంగస్థలం ఇప్పటివరకు 3 మిలియన్ల డాలర్లను రాబట్టింది. బాహుబలి 2 ($ 11.8M) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాకు యూఎస్ లో ప్రమియర్స్ కు పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ సినిమా త్వరలో 3.5 మిలియన్ మార్క్ ను ఈజీగా అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ వచ్చే వారం అక్కడ నాని కృష్ణార్జున యుద్ధం రిలీజ్ కాబోతోంది. మరి ఆ సినిమా ప్రభావం ఉంటె రంగస్థలం కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది

Similar News