రంగస్థలం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదండోయ్

Update: 2018-04-05 08:02 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం కలెక్షన్స్ కుమ్ముడు ఇంకా ఆపలేదు. శుక్రవారం సినిమా విడుదలైతే వీకెండ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ సోమవారం నుండి కలెక్షన్స్ డ్రాప్ కావడం మొదలవుతుంది. ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ సోమవారం మాత్రం థియేటర్స్ ఖాళీ అవడం చూస్తూనే ఉన్నాం. కానీ రంగస్థలం మాత్రం ఇంకా హైదరాబాద్, బెంగుళూరు చెన్నై వంటి నగరాల్లో థియేటర్స్ ఇప్పటికి ఫుల్ అవుతున్నాయి అంటే రంగస్థలం రేంజ్ ఏమిటో.. ఆ సినిమాకొచ్చిన టాక్ ఏమిటో స్పష్టంగా ఆర్షంవుతుంది. రామ్ చరణ్ చిట్టిబాబుగా కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్, సమంత రామలక్ష్మి గా అదరగొట్టిన తీరు, సుకుమార్ మేకింగ్ స్టయిల్ వెరసి రంగస్థలం సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు బోలెడన్ని లాభాలు తెచ్చి పెట్టింది. ఇప్పటికి రంగస్థలం కలెక్షన్స్ అదరగొడుతోనేఉన్నాయి. మరి 6 రోజుల్లో రంగస్థలం రెండు రాష్ట్రాల హడావిడి ఎలా ఉందొ చూద్దాం.

ఏరియా 6 రోజుల రంగస్థలం కలెక్షన్స్ కోట్లలో

నైజాం 15.84

సీడెడ్ 10.35

నెల్లూరు 1.95

కృష్ణా 4.34

గుంటూరు 5.79

వైజాగ్ 7.37

ఈస్ట్ గోదావరి 4.88

వెస్ట్ గోదావరి 3.70

ఆరు రోజుల రెండు రాష్ట్రాల షేర్స్ 54.22

Similar News