రంగస్థలం ఎంత వసూలు చేేసిందో తెలుసా..?

Update: 2018-06-07 07:30 GMT

రామ్ చరణ్ ఏడాది కష్టానికి సుకుమార్ రంగస్థలంతో మరిచిపోలేని కమర్షియల్ హిట్ అందించాడు. మాస్ లుక్ లో చిట్టిబాబు గా రామ్ చరణ్ అద్భుతంగా నటించిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఐదు ప్రధాన పాత్రలుగా సాగిన రంగస్థలం కథలో రామ్ చరణ్, సమంత, అనసూయ, జగపతి బాబు, ఆది పినిశెట్టిల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సుకుమార్ మేకింగ్ సినిమాకి మరో హైలెట్. అలాగే రాకింగ్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ కూడా రంగస్థలం సినిమాకి హైలెట్స్. అందుకే క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఓవరాల్ గా రంగస్థలాన్ని హిట్ చేసిపడేశారు. అలాగే కథలో ఇన్వాల్వ్ కావడానికి మొదటిసారి కొద్దిగా టైం పట్టడంతో.. ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ పెరగడానికి కారణమయ్యింది. ఇకపోతే మార్చ్ 30 న విడుదలైన రంగస్థలం క్లోజింగ్ కి వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా రంగస్థలం క్లోజింగ్ కలెక్షన్స్... మీకోసం.

ఏరియావైజ్ క్లోజింగ్ కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం 28.75

సీడెడ్ 18.32

వైజాగ్ 13.57

గుంటూరు 08.58

తూర్పు గోదావరి 08.00

కృష్ణ 07.10

పశ్చిమ గోదావరి 06.48

నెల్లూరు 03.55

ఏపీ + టీఎస్ 94.35 కోట్లు

ఓవర్సీస్ 18.00

కర్ణాటక 09.47

ఇతర ప్రాంతాలు 05 .20

రంగస్థలం వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ 127.02 కోట్లు

Similar News