బాబోయ్ ఒక్క సినిమాకే ఇంత రేంజ్ పెరిగిందా..?

Update: 2018-07-26 06:42 GMT

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ ఎప్పుడూ అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటూ వారి వెనక పడతాడే గాని కెరీర్ ని సీరియస్ గా తీసుకోడని అంటారు. బర్ఫీ వంటి మచ్చుకు కొన్ని సినిమాలు మాత్రమే అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి. దీపికాతో లవ్ ఎఫైర్ నడిపిన రణబీర్ కపూర్ తర్వాత కత్రినా కైఫ్ ని తగులుకున్నాడు. మరి దీపికా కావాలనే రణబీర్ తో బ్రేకప్ చేసుకుంది. రణబీర్ కపూర్ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం వలెనే తనతో బ్రేకప్ చేసుకున్నట్లుగా దీపికా చెప్పింది. ఇక తర్వాత కత్రినాతో ప్రేమాయణం డీప్ గా నడిపిన రణబీర్ కి కత్రినాతో కూడా చెడింది. తాజాగా అలియా భట్ తో తిరుగుతున్నాడు. ఇక వారి మధ్యన ఏదో సంథింగ్ సంథింగ్ థింగ్ అంటూ బీటౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

సంజయ్ హిట్ తో దూకుడు...

అయితే అలా రణబీర్ నిత్యం వార్తల్లో ఉంటె తాజాగా సంజయ్ దత్ బయోపిక్ సంజూతో ఒక్కసారిగా లైంటైంలో కొచ్చేసాడు. సంజయ్ దత్ బయోపిక్ లో అచ్చం సంజయ్ దత్ లా నటించి మార్కులు కొట్టేసిన రణబీర్ ఆ సినిమాతో 500 కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యాడు. సంజు సినిమా హిట్ టాక్ తో కోట్లు కొల్లగొడుతుంది. ఇప్పటికే 500 కోట్లు పైచిలుకు కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి తన వలన భారీ గా కలెక్షన్స్ వస్తుండడం చూసిన రణబీర్ కపూర్ తన రెమ్యునరేషన్ ని భీభత్సంగా పెంచేసేశాడట. సినిమాల్లోనే కాదు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న కొన్ని బ్రాండ్స్ విషయంలోనూ రణబీర్ తన పారితోషకాన్ని తెగ పెంచేసాడనే టాక్ వినబడుతుంది.

డబుల్ చేసేసాడు...

రణబీర్ కపూర్ చేతిలో బ్రహ్మస్త మూవీతో పాటు 10కి పైగా టాప్ బ్రాండ్లను కలిగివున్నాడని చెబుతున్నారు. ఇక ఆ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసినందుకు గాను... రణబీర్ ఇప్పటివరకు రోజుకు 3 కోట్ల నుండి 3.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. అయితే సంజు హిట్ తో రణబీర్ తన బ్రాండ్స్ వాల్యూని రోజుకి 6 కోట్లు వరకు వసూలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి నిన్న మొన్నటివరకు సాధారణ హీరోగా ఉన్న రణబీర్ అమాంతం స్టార్ హోదాలోకొచ్చేసాడు. అందుకే తన పారితోషకాన్ని డబుల్ చేసిపారేసాడు. మరి సినిమాలు హిట్ అయితే అంతే... అదే గనక ఫెయిల్ అయితే పాతాళానికే.

Similar News