రణబీర్ ని అన్నగా ఊహించుకోలేకపోయా?

Update: 2018-06-27 06:56 GMT

బాలీవుడ్ హీరోల్లో ఒకప్పుడు ప్లే బాయ్ ఎవరయ్యా అంటే అందరూ అక్షయ్ కుమార్ ని చూపించేవారు. కానీ ప్రస్తుతం ఆ ప్లే బాయ్ లా రణబీర్ కపూర్ ఉన్నాడు. తాను రొమాన్స్ చేసిన హీరోయిన్స్ తో ఎఫైర్స్ పెట్టుకోవడం.. తర్వాత వారికి బ్రేకప్ చెప్పేసి కొత్త గర్ల్ ఫ్రెండ్ ని వెతుక్కోవడం రణబీర్ కపూర్ కి వెన్నతో పెట్టిన విద్య. కత్రినా కపూర్ తో బ్రేకప్ అయ్యిందో లేదో... అలియా భట్ తో రణబీర్ తన లవ్ ఎఫైర్ ని కొనసాగిస్తున్నాడని బి టౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే ప్రస్తుతం రణబీర్ కపూర్ సంజయ్ దత్ బయో పిక్ సంజు సినిమా లో సంజయ్ దత్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే రణబీర్ కపూర్ పక్కన హీరోయిన్ గా నటించాలని చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ కలలు కంటుంటారు. అందుకే సంజు సినిమాలో రణబీర్ కపూర్ కి చెల్లెలిగా నటించడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోలేదట.

ప్రియా దత్ క్యారెక్టర్ లో...

పూరి జగన్నాధ్ - రవితేజ కాంబోలో వచ్చిన నేనింతే సినిమాలో రవితేజకి జోడిగా నటించిన శియా గౌతమ్.. ఆ సినిమా ఫ్లాప్ తో మళ్లీ తెలుగులో కనబడకుండా పోయిన శియా గౌతమ్ బాలీవుడ్ కి వెళ్లి అదితి శియ గా పేర్చు మార్చుకుంది. పేరు మర్చుకున్నా లక్కు కలిసిరాని అదితి శియ సంజు సినిమాలో రణబీర్ కపూర్ అంటే సంజయ్ దత్ చెల్లెలిగా ప్రియా దత్ క్యారెక్టర్ లో నటించింది. ప్రస్తుతం సంజు సినిమా ప్రమోషన్స్ లో ఉన్న అదితి శియ కి రణబీర్ కపూర్ చెల్లెలిగా నటించడంపై మీ స్పందన ఏమిటని అడగగా... అసలు రాజ్ కుమార్ హిరాణీ సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు అని చెప్పిన శియా అదితి.... రణబీర్ కు చెల్లిగా నటించినప్పటికీ... అతన్ని మాత్రం బ్రదర్ గా ఊహించుకోలేకపోయానని చెప్పి షాక్ ఇచ్చింది.

ఫ్యాన్ అయ్యాను...

ఇకపోతే సంజయ్ దత్ చెల్లెలు ప్రియా దత్ ను తాను ఎప్పుడూ కలవలేదని... కేవలం ప్రియా దత్ ఇంటర్వ్యూలను చూసి... ఆమె మేనరిజమ్స్ నేర్చుకుని ఈ సినిమాలో నటించానని...ఇక సింగిల్ టేక్ లో యాక్ట్ చేయగల గొప్ప నటుడు అని రణబీర్ కపూర్ ని పొగిడేసింది. ఇక రణబీర్ తో కలిసి నటించిన తర్వాత తాను అతడికి ఫ్యాన్ అయ్యానని చెప్పుకొచ్చింది.

Similar News