ఎన్టీఆర్ నుండి ఓ సీన్ లీక్ అయింది..!

Update: 2018-10-26 06:59 GMT

ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా.. చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. ఆయనకు సంబంధించి సీన్స్ అన్ని ఫినిష్ చేసాడు డైరెక్టర్ క్రిష్. అయితే రానా పాత్ర గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ సినిమాలో రానా పాత్ర చాలా తక్కువ సేపే ఉంటుందట. అది కూడా ఒక్క స‌న్నివేశానికే ప‌రిమితం అని తెలిసింది. అయితే సినిమాకి ఆ సీన్ చాలా కీలకం అని తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం జెండాతో గెలిచిన ఎమ్మెల్యేల్ని ఢిల్లీ తీసుకెళ్లి బ‌ల‌నిరూప‌ణ చేయ‌డంలో అప్ప‌ట్లో నారా చంద్ర‌బాబునాయుడు పాత్ర కీల‌కం. ఈ టోట‌ల్ ఎపిసోడ్ ఓ యాక్ష‌న్ ఘ‌ట్టాన్ని త‌లపిస్తుంది. ఈ సీన్ లోనే రానా క‌నిపిస్తాడు.

Similar News