రానా అరణ్య కథని బయటపెట్టిన దర్శకుడు..?

Update: 2018-06-23 10:45 GMT

బాహుబలిలో భళ్లాలదేవునిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా పేరు మాములుగా మార్మోగలేదు. హీరో ప్రభాస్ తో సమానంగా విలన్ రానా కి పేరొచ్చింది. హీరోకి సమఉజ్జిగా బాహుబలి లో నటించిన రానా హీరోగా కూడా తనదైన స్టయిల్లో దూసుకుపోతున్నాడు. అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్, అలాగే టాలీవుడ్ లోనూ డిఫ్రెంట్ కథలతో హీరోగా మెప్పిస్తున్నాడు రానా. మూడు భాషల్లో రానా చేసిన ఘాజి మంచి హిట్ అయ్యింది. అలాగే టాలీవుడ్ లోనూ నేనేరాజు నేనే మంత్రి కూడా డీసెంట్ హిట్ అయ్యింది. ఇక బాహుబలి, ఘాజి సినిమాలతో రానా మార్కెట్ బాలీవుడ్ లో కూడా పెరిగింది. అందుకే రానా తో చేసే దర్శకనిర్మాతలు రానా నటించే సినిమాలను అనేక భాషలో విడుదల చేసే ప్లాన్స్ చేస్తున్నారు.

దర్శకుడే చెప్పేశాడు

తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం రానా ఒక త్రిభాషా చిత్రంలో నటిస్తున్నాడు. త్రిభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో అరణ్య అనే టైటిల్ పెట్టారు. అలాగే హిందీలో హాథీ మేరీ సాథీ పేరుతో... తమిళంలో కాడన్ పేరుతో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ ని జరుపుతున్నారు. అయితే ఈ త్రిభాషా చిత్ర కథేంటన్నది ఇపుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ కథ ఎవరో లీక్ చేస్తే లీక్ అవ్వలేదు. స్వయానా ఈ చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర కథను చప్పేయ్యడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది.

కథ ఏంటంటే...

ఇంతకీ రానా అరణ్య మూవీ కథ ఏమిటంటే....ప్రభు సాల్మన్ గత చిత్రం గజరాజు చిత్రం కథ లానే ఈ రానా అరణ్య కథ కూడా ఉంటుందట. గజరాజు చిత్రంలో ఏనుగుకి, ఓ వ్యక్తికి మధ్య గల అనుబంధాన్ని రక్తికట్టించినట్లుగానే రానా అరణ్యలో కూడా కథ మొత్తం మునుషులు, ఏనుగులు చుట్టూనే తిరుగుతుందట. మనుషులకు.. ఏనుగులకు మధ్య పోరాటాన్ని ఈ సినిమా లో సినిమాటిక్ గా చూపించబోతున్నారట. మనుషుల చేసిన కొన్ని తప్పిదాల వలన ఏ దిక్కు లేని 20 ఏనుగుల్ని చేరదీసి వాటి బాగోగులు చూసే అడవి మనిషిగా ఈ అరణ్య సినిమాలో రానా కనిపిస్తాడట. మరి ఏనుగులతో రానా బాండింగ్ ని చూపిస్తూ మనుషులతో అతను చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపిస్తారని చెబుతున్నాడు ఈ సినిమా డైరెక్టర్ ప్రభు సాల్మన్.

Similar News