‘సుబ్రహ్మణ్యపురం’లో భళ్లాలదేవుడు

Update: 2018-12-01 10:06 GMT

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు. అయితే ఇందులో ఆయన నటించడం లేదు.. కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కథను నడిపించడంలో ఆ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ను పోషించనుందట. ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది. దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ ఇచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగమయ్యే టాలీవుడ్ రానా కు ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ట్రైలర్ కూడా బాగానచ్చింది. ‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకంపై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’ చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలకు కాబోతుంది.

Similar News