రానా 'బాబు' భార్య ఎవరో తెలుసా?

Update: 2018-08-14 07:02 GMT

క్రిష్ - బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ ని పరుగులు పెట్టిస్తున్న 'ఎన్టీఆర్' సినిమాపై బయటికొచ్చే వార్తలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన చంద్రబాబు పాత్రని హీరో రానా పోషిస్తున్నాడు. ఇంకా ఈ సినిమా లో పలువురు సెలబ్రిటీస్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా శ్రీదేవి పాత్రలో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇక నట, రాజకీయ జీవితాల్లో కీలకమైన ఘట్టాలను మాత్రమే 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం వాడుతున్నారని టాక్ ఉంది. అందుకే ఎన్టీఆర్ నట జీవితంలో ముఖ్యమైన వారిని అతిథి పాత్రల్లో ఇప్పటికే ఎంపిక చేస్తున్నారు.

భూవనేశ్వరి పాత్రలో మంజిమ మోహన్

ఇక 'ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీఆర్ కి అల్లుడు అంటే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి రోల్ ప్లే చేస్తున్న రానాకి ఇప్పడు జంట దొరికేసిందనే న్యూస్ వినబడుతుంది. చంద్రబాబు భార్య ఎన్టీఆర్ కి పెద్ద కూతురు భువనేశ్వరి పాత్రకి ఇప్పుడు హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ సినిమాలో రానాకి పెయిర్ గా భువనేశ్వరికి పాత్రధారిగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నాగ చైతన్యకి జంటగా నటించిన హీరోయిన్ మంజిమ మోహన్ చేస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. మంజిమ మోహన్ కి 'సాహసమే శ్వాసగా సాగిపో' సినిమా తర్వాత మళ్లీ తెలుగులో అవకాశం రాలేదు. ఇప్పుడు దర్శకుడు క్రిష్ భువనేశ్వరి పాత్రకి మంజిమని తీసుకున్నాడని చెబుతున్నారు.

Similar News