చంద్రబాబుగా.. ఆ హీరోనా?

Update: 2018-04-06 08:42 GMT

నేనే రాజు నేనే మంత్రితో కుర్చీలాటలో సీఎం కుర్చీకి చేరుకున్న హీరో రానా నటన అద్భుతః అన్న రీతిలో ఉంది. అస్సలు ఫామ్ లో లేని దర్శకుడు తేజ నేనే రాజు నే మంత్రి సినిమాని పొలిటికల్ బ్యాగ్ద్రోప్ లో తెరకెక్కించి అదరగొట్టే హిట్ కొట్టాడు. ఆ హిట్ తో తేజ మహనీయుడు అయిన ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కించే ఛాన్స్ కొట్టేసాడు. సీనియర్ హీరో బాలకృష్ణ తేజ ని నమ్మి ఈ ప్రతిష్ట్మాక చిత్రాన్ని అప్పగించాడు. ఇక తేజ - బాలయ్య ల ఎన్టీఆర్ బయో పిక్ పూజతో మొదలై సెట్స్ మీదకెళ్ళిపోయింది. రెండు రోజుల షూటింగ్ కూడా జరిపేసుకుంది.

ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ తో తేజ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక బాలకృష్ణ తప్ప ఈ సినిమాలో మరికొంతమంది నటీనటులను ఎంపిక చేసిన తేజ.. ఇంకా హీరోయిన్ గా అంటే బసవతారకం కేరెక్టర్ కి హీరోయిన్ ని గాని, అలాగే చంద్రబాబు పాత్రకి నటుడిని కానీ ఎంపిక చెయ్యలేదు. అయితే ఇప్పుడు బసవతారకం పాత్రకి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని సంప్రదిస్తున్నారనే టాక్ వుంది. ఇక ఇప్పుడు చంద్రబాబు పాత్రకి రానా ని సంప్రదిస్తున్నారనే ప్రచారం మొదలైంది. నేనే రాజు నేనే మంత్రి లో రానా నటనకు మెచ్చిన తేజ, ఎన్టీఆర్ సినిమాలో రానా కి చంద్రబాబు పాత్ర ని చెయ్యమని అడిగినట్లుగా తెలుస్తుంది.

మరి రానా ఎన్టీఆర్ లో చేసేందుకు ఒప్పుకుంటాడా లేదో అనే అనుమానమే అక్కర్లేదు. ఎందుకంటే తేజ తనకి నచ్చిన దర్శకుడు. అందుకే రానా కళ్ళు మూసుకుని ఒప్పేసుకుంటాడంటున్నారు. అందులోను ఎన్టీఆర్ బయో పిక్ లో బాలయ్య, చంద్రబాబుని విలన్ గా చూపించే సాహసం చెయ్యడు. మరి విలన్ గా కాకపోతే రానా ఈ కేరెక్టర్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరి చివరికి చంద్రబాబు పాత్రకి రానా చేస్తాడో మరో నటుడెవరన్న చేస్తారో అనేది చూడాలి

Similar News