రానా సినిమాలో సీనియర్ హీరోయిన్

గత రెండు రోజులుగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరక్కబోయే చిత్రంలో అల్లు అర్జున్ తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుందనే వార్త చక్కర్లు [more]

Update: 2019-03-23 07:15 GMT

గత రెండు రోజులుగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరక్కబోయే చిత్రంలో అల్లు అర్జున్ తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుందనే వార్త చక్కర్లు కొడుతోంది. టబు ఈ ఆఫర్ కి ఒప్పుకుంటుందో లేదో అంటూ వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. ఇంత వయసొచ్చినా ఇంకా గ్లామర్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తున్న టబు.. బన్నీకి తల్లిగానా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు కూడా. అయితే బన్నీ – త్రివిక్రమ్ సినిమాలో టబు నటిస్తుందో లేదో గానీ ప్రస్తుతం టబు.. రానా – సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం అనే సినిమాలో ఒక కీలక పాత్ర చెయ్యబోతుందనే న్యూస్ వినబడుతుంది.

అన్ని భాషల్లో విరాటపర్వం

వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి మెయిన్ లీడ్ లో నటించబోయే చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతుందట. ఇక ఈ సినిమాలో రానా ఒక పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడంటున్నారు. అయితే రాజకీయాలతో ముడిపెట్టి ప్రేమ కథను జొప్పించే ఈ చిత్రంలో ట‌బు మాన‌వ హ‌క్కుల నేత‌గా క‌నిపించ‌నున్న‌ద‌ట‌. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంద‌ని అందుకే టబు అయితే బాగుటుందని మేకర్స్ అనుకున్నారట. అలాగే ఈ విరాటపర్వం సినిమాని పలు భాషల్లో విడుదల చేసే యోచనలో ఉండడంతో.. ఈ సినిమాలో కాస్త పేరున్న ఆర్టిస్టులనే తీసుకోవాలని దర్శకనిర్మాతల ప్లాన్ అంట. వేణు ఉడుగుల నీది నాది ఒకే కథతో మంచి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. మరి క్రేజ్ ఉన్న సాయి పల్లవి, రానాతో ఈ సినిమా చేస్తున్న వేణు మళ్లీ హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమాని పట్టాలెక్కిస్తున్నాడట.

Tags:    

Similar News