బాబు పాత్ర చెయ్యడం ఛాలెంజ్..!

Update: 2018-10-13 06:13 GMT

ప్రస్తుతం అన్ని బయోపిక్స్ దారి వేరు.. ఇప్పుడు తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సంగతి వేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా ఎన్టీఆర్ బయోపిక్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ట్రేడ్ లో అందరి చూపు ఎన్టీఆర్ బయోపిక్ మీదే. ప్రస్తుతం మోస్ట్ పాపులర్ మూవీగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు క్రిష్ కూడా సినిమా మీద అంచనాలు అందరిలో పెంచుకుపోతున్నాడు. ఇక బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా కనబడుతున్నాడు. ఒక్కో కేరెక్టర్ ని క్రిష్ అంత అందంగా తీర్చిదిద్దుతున్నాడు. చంద్రబాబుగా రానా కూడా అదరగొట్టేస్తున్నాడు.

అది ఛాలెంజింగ్ పాత్ర

భారీ అంచనాల నడుమ భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చంద్రబాబుగా రానా కనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం నంబర్ వన్ యారీ సీజన్ 2 ప్రమోషన్స్‌ లో ఉన్న రానాని బాబు పాత్ర వెయ్యడం మీకెలా అనిపించింది అని అడగగా... చంద్రబాబు గారి పాత్ర చేయడం చాలా కష్టం. అది ఛాలెంజింగ్ పాత్ర. అయితే క్రిష్ లాంటి స్నేహితుడి అండతో.. ఆ కష్టాన్ని అధిగమిస్తున్నాను అంటూ తన చంద్రబాబు పాత్ర గురించి చెప్పాడు రానా. మరి చంద్రబాబు లుక్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయిన రానా బాబు పాత్ర చెయ్యడం ఛాలెంజింగ్ అని చెప్పడం మాత్రం భలే ఉందండి.

Similar News