తెలుగు అత్త నదియా.. తమిళంలో రమ్యకృష్ణ..!

Update: 2018-10-09 07:17 GMT

తెలుగులో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ లు ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక ఆ సినిమాలో మేనత్తని ఇంటికి తీసుకెళ్లడానికి మేనల్లుడు ఎలాంటి కష్టాలు పడ్డాడు.. చివరికి మేనత్తని పుట్టింటికి మేనల్లుడు ఎలా తీసుకెళ్లాడు అనే సింపుల్ స్టోరీ లైన్ తో త్రివిక్రమ్ అద్భుతం సృష్టించాడు. నదియా పుట్టింటి మీద విరక్తి పెంచుకున్న అత్తగా ఇరగదీసింది. అప్పట్లో నదియా ఈ సినిమాలో సునంద పాత్ర ద్వారా చాలా పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు దక్కించుకుంది. అయితే ఇప్పుడు తమిళంలో అత్తరింటికి దారేది సినిమాకి రీమేక్ చేస్తున్నారు. తమిళ వర్షన్ చిత్రం సుందర్ సి దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన సమంత, ప్రణీత సుభాష్ లు నటించారు.

అత్తగా కనిపించనున్న రమ్యకృష్ణ

ఇక తమిళ రీమేక్ లో శింబు సరసన మేఘా ఆకాశ్, కేథరీన్‌ థెరీసా హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది. అయితే తమిళ అత్తారింటికి దారేదిలో పొగరు గల అత్తగా రమ్యకృష్ణ నటించబోతుందని టాక్ వినబడుతుంది. బాహుబలిలో శివగామిగా ఒక మెట్టు పైకెక్కిన రమ్యకృష్ణ లేటెస్ట్ గా శైలజారెడ్డి అల్లుడులో పవర్ ఫుల్ అత్తగా నటించింది. గతంలోనే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ రజినీకాంత్ కి విలన్ గా నెగెటివ్ పాత్రలో ఇరగదీసింది. ఇక శైలజారెడ్డి అల్లుడులో రమ్యకృష్ణ పొగరు పట్టిన ఈగో అత్తగా మెప్పించింది కానీ.. ఆ సినిమా హిట్ కాలేదు. ఇక తాజాగా అత్తారింటికి దారేది తమిళ రీమేక్ లో రమ్యకృష్ణ... ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న శింబుకి అత్తగా కనిపించబోతుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. మరి హీరో శింబు, అత్త రమ్యకృష్ణ మధ్యన జరిగే సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనే క్యూరియాసిటీ అప్పుడే తమిళ ప్రేక్షకుల్లో మొదలైపోయింది.

Similar News