ఆ పాత్ర నాకు ఇష్టం లేదు

రజనీకాంత్ నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర వేసి అందరి ప్రశంసలు అందుకున్న రమ్యకృష్ణకు ఈ పాత్ర మాత్రం అస్సలు ఇష్టమే లేదంట. డైరెక్టర్ బలవంతం మేరకే ఆ [more]

Update: 2019-03-18 08:57 GMT

రజనీకాంత్ నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర వేసి అందరి ప్రశంసలు అందుకున్న రమ్యకృష్ణకు ఈ పాత్ర మాత్రం అస్సలు ఇష్టమే లేదంట. డైరెక్టర్ బలవంతం మేరకే ఆ పాత్ర చేసినట్లు రమ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. నరసింహ సినిమాలో సౌందర్య పాత్ర కావాలా, నీలాంబరి పాత్ర కావాలా అంటే తాను సౌందర్య పాత్రే ఎంచుకునేదాన్నని రమ్యకృష్ణ తెలిపింది.

చాలా ఇబ్బంది పడ్డాను…

ముఖ్యంగా సౌందర్య ముఖాన్ని కాలితో తాకుతూ పొగరు చూపించాల్సిన సన్నివేశంలో తాను చాలా ఇబ్బంది పడ్డట్లు రమ్య చెప్పింది. అయితే రవికుమార్ విజన్, కన్విక్షన్‌ను నమ్మి ఆ సన్నివేశం చేసానని చెప్పింది. ఆ సినిమా చేస్తున్నన్ని రోజులూ చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చారు. కానీ ప్రేక్షకుల్లో ఈ పాత్ర ఎప్పటిటీ గుర్తుండిపోయిందని, అసలు ఆ పాత్ర అంతలా క్లిక్ అవుతుందని తాను ఊహించలేదని రమ్య తెలిపింది.

Tags:    

Similar News