మహేష్ సినిమాలో రమ్యకృష్ణ..?

మహేష్ మహర్షి చిత్రం మే 9న విడుదలకు సిద్దమవుతుంది. మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తన 26వ సినిమాని జూన్ [more]

Update: 2019-04-27 08:12 GMT

మహేష్ మహర్షి చిత్రం మే 9న విడుదలకు సిద్దమవుతుంది. మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తన 26వ సినిమాని జూన్ నుండి పట్టాలెక్కించబోతున్నాడనే న్యూస్ ఉంది. ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లను దింపుతున్నాడు. ఎఫ్ 2 హిట్ తో ఒక్కసారిగా హైలెట్ అయిన అనిల్ రావిపూడి మహేష్ కోసం కూడా కామెడీతో కూడిన కథనే రాసుకున్నాడు. మహేష్ – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మహేష్ 26 సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎపుడో సినిమాలు వదిలేసి రాజకీయాల వెంట పడిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్ర చేయబోతుంది.

రమ్యకృష్ణను తీసుకుంటున్నారా..?

అలాగే కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ సినిమాలో కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విజయశాంతి, మహేష్ సినిమాలో కన్ఫర్మ్ అవునో కాదో తెలియదు కానీ బండ్ల గణేష్ మాత్రం కన్ఫర్మ్. ఇక ఇప్పుడు మహేష్ కోసం శివగామి కూడా దిగబోతుందట. శివగామిగా బాహుబలిలో అదరగొట్టిన రమ్యకృష్ణ మహేష్ – అనిల్ రావిపూడి సినిమాలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. మహేష్ సినిమాలో రమ్యకృష్ణకు ఒక ఆసక్తికరమైన మరియు కష్టమైన పాత్ర దక్కింది అని తెలుస్తోంది. ఇక ఆ సినిమాలో తన పాత్ర విపరీతంగా నచ్చేయడంతో రమ్యకృష్ణ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేసిందని సమాచారం అందుతుంది.

Tags:    

Similar News