వర్మ రాజకీయం ఇదేనా..?

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ ఏపీలో మొత్తానికి ఆగిపోయింది. హైకోర్టు ఈ విడుదలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ [more]

Update: 2019-03-29 11:20 GMT

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ ఏపీలో మొత్తానికి ఆగిపోయింది. హైకోర్టు ఈ విడుదలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 వరకు సినిమాను ఆపాలని హైకోర్టు పేర్కొనగా మంగళగిరి కోర్టు ఏప్రిల్ 15 వరకు సినిమా రిలీజ్ కాకూడదని పేర్కొనడం గమనార్హం. ఏప్రిల్ 3న కూడా న్యాయమూర్తుల ఛాంబర్‌లో సినిమాను ప్రదర్శించాలని కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారు చూసాక సినిమా రిలీజ్ చేయాలో వద్దో వారే నిర్ణయిస్తారు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రాలోనే ఆగింది. తెలంగాణ ఈ సినిమా విడుదల అయిపోయింది. మార్నింగ్ షోస్ ఎటువంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అయిపోయింది.

ఆంధ్రలో ప్రభావం ఉంటుందా..?

ఇందులో చంద్రబాబుని పూర్తిగా నెగటివ్ గా చూపించారన్నది ముందు నుండీ ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమే. అనుకున్నట్లే ఈ సినిమాలో చంద్రబాబుని నెగటివ్ గా చూపించారు. తెలంగాణాలో చాలా చోట్ల ఆక్యుపెన్సీ చాలా బాగుంది. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది. వర్మ ప్లాన్ ఏంటంటే తెలంగాణాలో ఈ సినిమా రిలీజ్ అయినా ఎంతోకొంత ప్రభావం ఏపీపై పడుతుందని నమ్మి రిలీజ్ చేసాడు. చూద్దాం దీని ప్రభావం ఆంధ్ర ఎలక్షన్స్ పై ఎంతవరకు పడుతుందో.

Tags:    

Similar News