మరో సంచలనానికి తెరతీస్తున్న ఆర్జీవీ

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్తాడు. మొట్టమొదటి సారిగా ‘కోబ్రా’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’ [more]

Update: 2019-04-08 07:33 GMT

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్తాడు. మొట్టమొదటి సారిగా ‘కోబ్రా’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై డి.పి.ఆర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వర్మ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఓ మోస్ట్ డేంజరెస్ క్రిమినల్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ‘కోబ్రా’ మూవీ హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతుంది. రీసెంట్ గా విజయం సాధించిన ‘లక్షీస్ ఎన్టీఆర్’ లాగానే ఈ సినిమాను కూడా రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. ఇంటెలిజన్స్ ఆఫీసర్ పాత్రలో రామ్ గోపాల్ వర్మ నటిస్తుండగా, క్రిమినల్ పాత్రలో కె.జి అనే కొత్త యాక్టర్ నటిస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను రంగారావు అనే నటుడు పోషిస్తున్నారు.

Tags:    

Similar News